మీల్‌మేకర్ మంచూరియా ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 23 జూన్ 2014 (18:25 IST)
మీల్ మేకర్‌లోని హై ప్రోటీన్స్ మహిళల, పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసే ఈ మీల్ మేకర్‌లో బి- విటమిన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. అలాంటి మీల్ మేకర్‌తో మంచూరియా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా?
 
కావలసిన పదార్థాలు: మీల్‌మేకర్ - 200 గ్రాములు, కొత్తిమీర - 3 కట్టలు, సోయాసాస్ - 6 స్పూన్లు, ఉల్లి కాడలు - 100 గ్రా, వెనిగర్ - 4 స్పూన్లు, అజినమోటా - 2 స్పూన్లు, కార్న్‌ఫ్లోర్ పౌడర్ - 2 స్పూన్లు, అల్లం, వెల్లుల్లి - 100గ్రా, పచ్చిమిరపకాయలు - పది, నూనె - సరిపడేంత, ఉప్పు - సరిపడేంత.
 
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో మీల్‌మేకర్స్‌ను నీటిలో నాన్చి దాన్ని పది నిమిషాల పాటు స్టౌమీద ఉడికించాలి. ఆ తర్వాత గిన్నెలోని నీటిని తొలగించి మీల్‌మేకర్స్‌ను దోరగా నూనెలో వేయించుకుని పక్కన బెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె పోసి కాగాక, పచ్చిమిరపకాయలు సన్నని ముక్కలుగా తరుగుకొని వాటితో పాటు అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకోవాలి. 
 
సన్నని మంటపై ఉంచి బాగా వేగాక, రెండు గ్లాసుల నీరు పోసి సోయాసాస్, వెనిగర్, అజినమోటా, ఉప్పు కలుపుకోవాలి. కాసేపయ్యాక కార్న్‌ఫ్లోర్‌ను నీటితో కలిపి అందులో వేయాలి. నీరు ఇంకే వరకు గరిటెతో కలియబెడుతూ ఉండాలి. అలా నీరు ఇంకిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర వేసి పొడిగా వేయించి మంచూరియా తయారు చేసుకోవాలి.
 దీంతో వేడి వేడి మీల్‌మేకర్ మంచూరియా రెడీ. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Show comments