Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగులే కదా అని తీసిపారేయకండి.. రాగి దోసె ట్రై చేయండి..

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (12:50 IST)
రాగులు అనగానే కొందరు తేలిగ్గా తీసిపారేస్తారు. కానీ రాగుల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. క్యాల్షియం ఇతర గింజల్లో వేటిలో లేనంత క్యాల్షియం నిల్వలు రాగుల్లో వుంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టి కోసం కొందరు క్యాల్షియం మాత్రలను వాడుతుంటారు. వాటికి బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. 
 
రాగుల్లో కొవ్వు తక్కువ కనుక అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటుంటే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం కాకుండా రాగులు తీసుకుంటుంటే బరువు కంట్రోల్ అవుతుంది. అలాంటి రాగులతో రాగి దోసె ఎలా చేయాలో చూద్దాం.. 
 
రాగి దోసె తయారీ విధానం:
 
కావలసిన పదార్థాలు:
రాగిపిండి- ఒక కప్పు,
బియ్యం పిండి- అరకప్పు,
కొత్తిమీర- ఒకకట్ట, 
అల్లం- చిన్నముక్క.
నీళ్లు- తగినన్ని, 
ఉప్పు- తగినంత, 
పచ్చిమిర్చి- ఒకటి, 
 
తయారీ విధానం: 
ఒక పాత్రలో రాగిపిండి, బియ్యం పిండి, రవ్వ, పెరుగు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. తరువాత పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కను సన్నగా తరిగి వేసుకోవాలి. 
 
నాన్‌‌‌స్టిక్ పాన్‌‌‌పై స్టవ్‌‌‌పై పెట్టి దోసె పోసుకోవాలి. సాధారణ దోసె మాదిరిగా పాన్ మొత్తం అయ్యేలా అనకూడదు. కొద్దిగా నూనె వేసి చిన్న మంటపై కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తరువాత తిప్పి మరోవైపు కాల్చుకోవాలి. పుదీనా చట్ని లేక కొబ్బరి చట్నీతో రాగి దోసెలు తింటే రుచిగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments