Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోబీ మటర్ ఫ్రై ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (18:32 IST)
కాలీఫ్లవర్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాలీఫ్లవర్‌లో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్, ఫైటోన్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. అలాగే వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే గోబీతో మటర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు : 
గోబి: నాలుగు కప్పులు
మట్టర్ : రెండు కప్పులు 
పచ్చిమిర్చి తరుగు : పావు కప్పు
పసుపు: ఒక టీ స్పూన్ 
కారం: ఒక టీ స్పూన్ 
ధనియాలపొడి: ఒక టీ స్పూన్ 
గరం మసాలా: ఒక టీ స్పూన్ 
జీలకర్ర: ఒక టీ స్పూన్ 
బిర్యానీ ఆకు: కొంత
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత. 
 
తయారీ విధానం:
ముందుగా శుభ్రం చేసిన క్యాలీఫ్లవర్ పువ్వుల్ని వేడి నీళ్ళలో వేసి 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఫామ్ కాదు. తర్వాత పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర బిర్యానీ ఆకు వేసి వేపుకోవాలి. 
 
తర్వాత వేడినీళ్ళు వంపేసిన క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి మీడియం మంట మీద రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. కాలీఫ్లవర్ వేగుతున్నప్పుడే, అందులో పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. 
 
పదినిముషాలు గోబీ ఫ్రై అయ్యి, గోల్డ్ బ్రౌన్ కలర్‌లోకి మారాక అందులో పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసి, మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
 
ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి రెండు నిముషాలు ఉడికించి స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే గోబీ మట్టర్ సైడ్ డిష్ రెడీ..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments