Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొండకాయతో బిర్యాని తయారీనా? ఎలా?

దొండకాయలోని విటమిన్‌ బి నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని రిబోఫ్లేవిన్‌ ఎక్కువగా ఉంటుంది కనుక దొండ మనస్సును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదపడుతుంది. మరి ఇటు

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (12:57 IST)
దొండకాయలోని విటమిన్‌ బి నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని రిబోఫ్లేవిన్‌ ఎక్కువగా ఉంటుంది కనుక దొండ మనస్సును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ తగ్గడానికి దోహదపడుతుంది. మరి ఇటువంటి దొండకాయతో బిర్యాని ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
బాస్‌మతి బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయ - 1 
నూనె - స్పూన్స్
నెయ్యి - 1/2 స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కొబ్బరి పేస్ట్ - 2 స్పూన్స్
దనియాలుపొడి - 1 స్పూన్
జీరాపొడి - 1/2 స్పూన్
కారం - 1 స్పూన్
పసుపు - 1/2 స్పూన్
దొండకాయలు - పావుకేజీ
ఉప్పు - సరిపడా
నిమ్మరసం - 1 స్పూన్
కొత్తిమీర - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
 
తయారీ విధానం: 
ముందుగా బియ్యం పొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి నిలువుగా తరిగిన దొండకాయల్ని 15 నిమిషాలు వేగించి తీసేయాలి. అదే నూనెలో ఉల్లి, అల్లం వెల్లుల్లి, పుదీనా వేగించి కొబ్బరి పేస్ట్ కలుపుకోవాలి. 2 నిమిషాల తరువాత ధనియాలు పొడి, జీరాపొడి, పసుపు, ఉప్పు, కారం కలిపి దొండకాయ ముక్కలు వేసి 7 నిమిషాలు వేగాక ఆ మిశ్రమంలో అన్నం, నిమ్మరసం కలుపుకుని దించేయాలి. అంతే దొండకాయ బిర్యాని రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

ఆ నగల్లో వాటా ఇవ్వండి లేదంటే అమ్మ చితిపై నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

తర్వాతి కథనం
Show comments