చిల్లీ పనీర్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

Webdunia
గురువారం, 29 మే 2014 (12:09 IST)
పనీర్ టైప్ టూ డయాబెటిస్‌ను దూరం చేస్తుంది. ఒబిసిటీ, హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది. బరువును తగ్గించే పనీర్‌‌లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పనీర్ తేలికగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి పనీర్‌, క్యాప్సికమ్‌లను తీసుకోవడం ద్వారా ఎముకలకు బలాన్ని ఇస్తాయి. 
 
పనీర్‌లోని క్యాల్షియం మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముకలకు ఎంతో మేలు చేసే పనీర్‌తో చిల్లీ పనీర్ తయారు చేయడం మీకు తెలుసా అయితే ఇదిగోండి తయారీ విధానం ట్రై చేసి చూడండి. 
 
కావలసిన పదార్థాలు :
‌పనీర్‌ - 200 గ్రాములు  
పచ్చిమిర్చి - ఆరు
‌కోడి గుడ్డు - రెండు. 
‌చిల్లీ సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను. 
‌నూనె - వేయించడానికి తగినంత. 
‌సన్నగా తరిగిన వెల్లుల్లి - ‌ఒక టేబుల్‌ స్పూను 
మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు. 
కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌ స్పూను 
ఉప్పు - అర టీ స్పూను. 
‌అజనొమోటో - అర టీ స్పూను. 
 
తయారీ విధానం :
ముందుగా పనీర్‌ను ఫ్రిజ్ నుంచి తీసి కాసేపయ్యాక పనీర్‌ను డైమండ్‌ ఆకారంలో ముక్కలు చేసుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, కోడిగుడ్డు సొన వేసి కలపాలి. వీటి మిశ్రమం పనీర్‌ ముక్కలకు కోటింగ్‌గా పట్టేస్తుంది. ఇలా కలిపిన వెంటనే నూనె వేడిచేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి. 
 
బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన మిర్చి, వెల్లుల్లి వేసి వేగిన తరువాత రెండు టీ స్పూన్ల నీళ్లు, ఉప్పు, అజనొమోటో, చిల్లీ సాస్‌ వేసి అన్నింటినీ దోరగా వేపుకున్న తర్వాత వేయించి వుంచిన పనీర్ ముక్కల్ని అందులో కలిపి ఐదు నిమిషాల తర్వాత దింపేయాలి. ఈ చిల్లీ పన్నీర్‌ను పిల్లలకు రోటీలకు గార్నిష్‌తో సర్వ్ చేస్తే చాలా ఇష్టపడి తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాకింగ్‌కు వెళ్లినా వదలరా? హైదరాబాదులో మహిళకు వేధింపులు.. వీడియో

ఆర్డర్ చేసిన వస్తువుల్ని డెలివరీ చేశాడు.. ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారం..

Rains in Hyderabad: తెలంగాణలో తేలికపాటి వర్షాలు- ఎల్లో అలర్ట్

మేనకోడలిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. మానసిక వికలాంగురాలైనా..?

Woman: బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ చిత్రానికి కాసుల వర్షం, వారంలోనే రూ. 2 వేల కోట్లు

మా అమ్మానాన్నా వివాహ తేదీని ఇందిరా గాంధీ నిర్ణయిచారు : అమీషా పటేల్

NTR: ఊసరవెల్లి 4K విడుదలలో బెంగుళూరు, తిరుపతిలో కార్యక్రమాలు

Chiranjeevi: చిరంజీవి, బాబీ సినిమా కోసం నిర్మాత మార్పు ?

Kajal: రసాయనాల దుర్వినియోగం నేపథ్యంగా కాజల్ అగర్వాల్.. ది ఇండియా స్టోరీ

Show comments