Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలీఫ్లవర్‌ పరోటా తయారు చేయడం ఎలా?

Webdunia
బుధవారం, 25 జూన్ 2014 (17:59 IST)
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి - రెండు కప్పులు, కాలీఫ్లవర్‌ తురుము - పావు కప్పు, సోంపు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి), ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరం మసాలా - అర స్పూను, అల్లంపేస్టు - ఒక స్పూను.
 
తయారు చేసే విధానం:
ఓ అరగంట ముందుగా గోధుమ పిండిని తడిపి ఉంచుకోవాలి. క్యాలీఫ్లవర్‌ కడిగి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఓ పాత్రను తీసుకొని అందులో సరిపడా కాలీఫ్లవర్ తురుము, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ధనియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల ముందే కాలీఫ్లవర్‌ మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శనగపిండిని కాని కలిపితే తడి ఉండదు.
 
తడిపిన గోధుమ పిండిని చిన్న చిన్న చపాతీలుగా రుద్ది దానిపై, ఉండలుగా చేసుకున్న క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని ఉంచి చపాతీతో పూర్తిగా కప్పేసి మళ్లీ పరోటాల మాదిరిగా రొట్టెల పీటమీద వేసి రోల్‌ చేయాలి. ఇలా చపాతీలుగా చేసుకున్న వాటిని పెనం మీద తక్కువ మంటపై కాల్చాలి. పూర్తిగా వేగాకా దించే ముందు కాస్తంగా బటర్‌ (వెన్న) రాస్తే పరోటాలు రుచిగా వుంటాయి.
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments