Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

సెల్వి
శుక్రవారం, 22 నవంబరు 2024 (19:11 IST)
Cabbage Biryani
ఎప్పుడూ చికెన్, మటన్, వెజ్ బిర్యానీలతో బోర్ కొట్టేసిందా.. అయితే క్యాబేజీలో బిర్యానీ ట్రై చేయండి. విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉన్న క్యాబేజీ గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా కాన్సర్ నిరోధకంగా క్యాబేజీ తినొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
అంతేకాదు, పొటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. క్యాబేజీని తినడం వల్ల అధికబరువు, కండరాల నొప్పులు తగ్గించి జుట్టు పెరుగుదల పెరుగుతుంది. అలాంటి క్యాబేజీతో రుచికరమైన బిర్యానీ రైస్ ఎలా చేయాలంటే.. 
 
ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు సోంపు, లవంగం, రెండు యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆపై తరిగిన మూడేసి ఉల్లి, టమోటా, రెండు కప్పుల క్యాబేజీ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. 
 
అందులో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా కాస్త, కారానికి పచ్చిమిర్చి వేసి తగినంత ఉప్పు చేర్చుకోవాలి. అరకేజీ బియ్యానికి పైన చెప్పిన పదార్థాలు సరిపోతాయి. అలాగే ఒక గ్లాసుడు బియ్యానికి రెండు గ్లాసుల నీటిని చేర్చి.. కుక్కర్ క్లోజ్ చేయాలి. రెండు విజిల్స్ వచ్చాక దించేయాలి. 
 
ఇంతలో ఇందుకు పెరుగు పచ్చడి కూడా సిద్ధం చేసుకోవాలి. అంతే వేడి వేడి క్యాబేజీ బిర్యానీని పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments