బ్రెడ్‌తో ఆనియన్ పకోడీలు ట్రై చేయండి..

శీతాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటుంటాం. అయితే తీసుకునే స్నాక్స్‌ విషయంలోనూ పోషకాలుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. ఆనియన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (13:20 IST)
శీతాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటుంటాం. అయితే తీసుకునే స్నాక్స్‌ విషయంలోనూ పోషకాలుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. ఆనియన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇంకా వచ్చిన రోగాలు సైతం మాయమైపోతాయి. అందుకే ఉల్లిపాయలతో బ్రెడ్ పకోడీలు ట్రై చేయండి. 
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి -  రెండు కప్పులు. 
జొన్నపిండి - ఒక కప్పు
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు
బఠాణీ పిండి - అర కప్పు
కొత్తిమీర -  అరకప్పు
ఉప్పు - సరిపడినంత. 
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత. 
మజ్జిగ - ఒక కప్పు. 
బ్రెడ్ - 12 ముక్కలు
ఉల్లి (తురుము) - అరకప్పు
మిర్చి, అల్లం పేస్టు - మూడు టీ స్పూన్లు. 
 
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉల్లితరుగు, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండేయాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాట సాస్‌లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆప్ మాజీ అభ్యర్థి అనుమానాస్పద మృతి - ప్రియుడే చంపేశాడా?

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బిర్యానీలో ఈగ - రూ.లక్ష జరినామా

వెనెజువెలాలో భారీ భూకంపం.. లక్ష మంది మృతి? (Video)

సట్లెజ్ నదిపై గ్రావెల్ ట్రక్కు వెళుతుండగా కూలిన ట్రక్కు (వీడియో)

తిరుపతి జిల్లాలో నలుగురి ప్రాణాలు తీసిన విజిల్.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments