సమ్మర్ స్పెషల్ : అవియల్ టేస్ట్ చేయండి

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:54 IST)
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించడం ద్వారా బరువును పెరగడాన్ని నియంత్రిస్తాయి. మధుమేహాన్ని దూరం చేస్తాయి. అలాంటి కూరగాయలతో అవియల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
 
‌కొబ్బరి నూనె - అర కప్పు 
‌జీలకర్ర - 1 టీ స్పూన్‌.
‌కరివేపాకు - ‌1 కట్ట.
పచ్చి కొబ్బరి పేస్టు - అరకప్పు 
పెరుగు - అరకప్పు 
బియ్యపిండి. - 2 టీ స్పూన్స్.
‌పచ్చిమిర్చి తరుగు - పావు కప్పు 
‌పాలు - అర కప్పు 
‌ఉప్పు- తగినంత.
‌మునక్కాయలు, క్యారెట్, బీన్స్,  పచ్చి అరటి, కంద ముక్కలు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
కూరగాయలను పొడవు ముక్కలుగా తరిగి, ఉడికించి నీటిని వడపోసి ముక్కలను పక్కన ఉంచాలి. బాణలిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి పేస్టు, పెరుగు, బియ్యప్పిండి వేసి సన్న మంట మీద కొద్ది సేలు ఉడికించి, అందులో పాలను వేయాలి. అవి మరిగేటప్పుడు కూరగాయ ముక్కలను వేసి కొద్ది సేపు ఉడికించాలి. దించేముందు మిగిలిన కొబ్బరినూనె పోసి బాగా కలపాలి. అంతే అవియల్ రెడీ.. ఈ అవియల్‌ను దోసెలకు సైడిష్‌గా కొత్తిమీర గార్నిష్‌తో సర్వ్ చేయొచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kerala: 52 ఏళ్ల మహిళకు ఎబోలా.. జ్వరంతో ఆస్పత్రిలో చేరితే.. చివరికి?

భర్త మరణాంతరం అతని ఆస్తి నుంచి భరణం పొందొచ్చు : బాంబే హైకోర్టు

స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అత్యాచారం.. బయటకు చెపితే ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టిస్తానంటూ...

కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్‌లైన్‌లో వ్యాప్తికి అడ్డుకట్ట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anil Ravipudi movie: లాంఛనగా అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, వెంకటేష్ చిత్రం ప్రారంభం

Samantha and Vijay: ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రశంనించిన సమంత రూత్ ప్రభు

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Show comments