నోరూరించే ఆలూ కిచిడి

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (13:15 IST)
కావల్సిన పదార్థాలు: 
బియ్యం - ఒక కప్పు 
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టీ స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకలు - ఒకటి (వాసన కోసం)
పచ్చిబఠానీలు - 50 గ్రాములు
బంగాళదుంప - ఒకటి పెద్దది (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉప్పు - తగినంత 
పచ్చిమిరపకాయలు - రెండు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నీళ్ళు - మూడు కప్పులు
 
తయారుచేయండి ఇలా :
మొదట బియ్యంను శుబ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, యాలకను తుంచి వేసి ఒక ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత అందులో బియ్యం కూడా వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలు, పచ్చిబఠానీలను కలుపుకోవాలి. తర్వాత మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకుని, అందలో తరిగిన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, సరిపడా నీళ్ళు సోసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు మంటను మీడియంగా పెట్టి 15నిముషాలు ఉడికించుకోవాలి. కిచిడి మెత్తబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఆలూ కిచిడి రెడీ. దీనిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

Show comments