Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోయాబీన్స్‌తో సమోసా ఎలా చేయాలి?

Webdunia
FILE
ప్రోస్టేట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టే సోయాబీన్స్‌తో రకరకాల వంటకాలు చేసుకోవాచ్చు. సోయా బీన్స్‌ను గ్రేవీలు, పలావ్, బిర్యానీల్లో మాత్రమే గాకుండా వెరైటీలు ట్రై చేయండి. ఫాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే సోయాబీన్స్ రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. ఒబిసిటీకి బ్రేక్ వేస్తుంది. అలాంటి సోయాతో సమోసా తింటే ఎలా వుంటుంది. అయితే ఇదిగోండి రెసిపీ ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు :
సోయా గ్రాన్యూల్ - వంద గ్రాములు
ఉల్లిపాయలు - అర కప్పు.
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
మైదా - 500 గ్రా.
ఉప్పు - తగినంత.
వనస్పతి - 50 గ్రా.
రిపైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.
పచ్చిమిర్చి - ఏడు.
కొత్తిమీర తరుగు - అరకప్పు.
నిమ్మరసం - 4 టీ స్పూన్లు.
కారం - అర టీ స్పూన్.
పసుపు - పావు టీ స్పూన్.
ధనియాలపొడి - అర టీ స్పూన్.
చాట్ మసాలా - అర టీ స్పూన్.

తయారీ విధానం :
ముందుగా సమోసాలో డిప్ చేసే గ్రేవీని సిద్ధం చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్‌ను పది నిమిషాలు నానబెట్టి.. నీరు ఇరిగాక పక్కనబెట్టుకోవాలి. వెడల్పాటి పాన్‌లో ఆరు టీస్పూన్ల నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలి.

ఆపైన అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ధనియాల పోడి కలిపి రెండు నిమిషాలపాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమంలో పొడిని పొడిపొడిలాడేలా వేయించండి. దించే ముందు కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా కలపండి. ఇప్పుడు కూర సిద్ధంగా ఉన్నట్లే.

తర్వాత వనస్పతి, ఉప్పు కలిపిన మైదాను చంపాతీ పిండిలా సిద్ధం చేసుకోవాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేయండి. వీటిని చపాతీల్లా వత్తండి. ఒక్కో చపాతీని సగానికి కోయండి. సగం కోసిన ముక్కను రెండు చివర్లా జత చేసి శంఖు ఆకృతిలో చేయండి.

ఇందులో సిద్దంగా ఉన్న సోయా గ్రాన్యూల్స్ కూరను డిప్ చేసి సమోసా మడవాలి. ఈ సమోసాలను వేడి చేసిన నూనెలో దోరగా వేయించి.. టమోటా లేదా చిల్లీసాస్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా వుంటాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments