Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయ- జీడిపప్పు కూరంటే లొట్టలేసుకుని తినాల్సిందే!

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2013 (18:14 IST)
FILE
జీడిపప్పులోని ప్రతి గ్రాములో తొమ్మిది కెలోరీలు ఉన్నాయి. ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్ కలిగివున్న జీడిపప్పులో ఫాట్ ఎక్కువ. అందుచేత పిల్లలకు పోషకాల కోసం వారానికోసారి వంటల్లో వాడవచ్చు. అలాగే వంకాయలో ఔషధ గుణాలెన్నో దాగివున్నాయి. కేన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్‌కు వంకాయ చెక్ పెడుతుంది. ఇంకేముంది.. జీడిపప్పు ప్లస్ వంకాయ.. ఈ రెండింటితో కూర చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా.

కావలసిన పదార్థాలు :
వంకాయలు - పావు కేజీ.
జీడిపప్పు - వంద గ్రాములు.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.

పోపుకు కావాల్సినవి :
ఎండిమిర్చి - నాలుగు
ఆవాలు - అర టీ స్పూన్.
అల్లం - చిన్న ముక్క.
పచ్చిమిర్చి - రెండు.
నూనె - తాలింపుకు తగినంత
మినప పప్పు - ఒక టీ స్పూన్.
జీలకర్ర - పావు టీ స్పూన్.
శనగపప్పు - ఒక టీ స్పూన్.
కరివేపాకు - కొద్దిగా.
కొత్తమీర - కొద్దిగా.

తయారీ విధానం :
ముందుగా ఉప్పు వేసిన నీటిలో తరిగిన వంకాయ ముక్కలు వేయాలి. జీడిపప్పును పొట్టు తీసుకుని ముక్కలు చేసుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి వేగాక, జీడిపప్పు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి సన్న సెగలో మూత పెట్టి మగ్గించాలి. ఆఖరున దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments