Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకుతో పచ్చడి తయారు చేయడం ఎలా?

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2013 (16:35 IST)
WD
కావలసినని :
మునగాకు : కప్పు
జీలకర్ర : టీస్పూను
వెల్లుల్లి : 6 రెబ్పలు
నువ్వులు : పావు కప్పు
పసుపు : కొద్దిగా
ఉప్పు : తగినంత
నూనె : 2 టీస్పూన్
పచ్చిమిర్చి : ఆరు
చింతపండు : కొద్దిగా

తాలింపుకోసం :
ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి : కొద్దికొద్దిగా
కరివేపాకు : రెండు రెబ్బలు

తయారు చేసే విధానం :
ముందుగా బాణిలో నువ్వులు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి. అదే బాణిలో నూనె వేసి కాగాక, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మునగాకు వేసి వేయించి చల్లార్చాలి.

మిక్సిలో ముందుగా నువ్వులు వేసి పొడి చేశాక, వెల్లుల్లి, జీలకర్ర, వేసి తిప్పాలి. తరువాత పచ్చిమిర్చి, మునగాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. చిన్న బాణిలో కొద్దిగా నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేయించి పచ్చడిలో కలపాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments