Webdunia - Bharat's app for daily news and videos

Install App

బచ్చలి కంద కూరను టేస్ట్ చేశారా?

Webdunia
FILE
బచ్చలికూరలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. పిండిపదార్థాలు - 3.4గ్రా, మాంసకృత్తులు-1.9గ్రా, క్యాల్షియం-60 మి.గ్రాములున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బచ్చలితో కందకూర ఎలా చేయాలో మీకు తెలుసా..? అయితే ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు :
బచ్చలి కూర - ఒక కట్ట
కంద - పావు కేజీ
ఆవాలు - రెండు టీ స్పూన్లు
నూనె- తగినంత
చింతపండు - కాసింత
శెనగపప్పు- 1 టీస్పూ
మినప్పప్పు- 1 టీస్పూ
కరివేపాకు- 2 రెమ్మలు
ఉప్పు- సరిపడా
పచ్చిమిర్చి- రెండు
ఎండుమిర్చి - రెండు

తయారీ విధానం :
ముందుగా కంద చెక్కు తీసి ముక్కలు చేసుకోవాలి. బచ్చలి కూరను కూడా సన్నగా తరుక్కోవాలి. రెండింటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించి, ఉడికాక నీటిని వేరు చేసుకోవాలి. చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరుకోవాలి.

మరోవైపు బాణలిలో నూనె వేసి కాగాక శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కల్ని దోరగా వేపుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి బాగా కలిపితే బచ్చలి కంద కూర రెడీ. ఈ కూరను రోటీల్లోకి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేస్తే టేస్ట్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments