Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపిల్ ఫ్రైడ్ రైస్: ఎముకలకు బలాన్నిస్తుందట.!

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2013 (16:49 IST)
FILE
పైనాపిల్‌లో దగ్గు, జలుబును నియంత్రించే గుణాలున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, ఎముకలను బలపరిచే పైనాపిల్‌తో జ్యూస్‌లు, సలాడ్లే కాకుండా పైనాపిల్‌తో ఫ్రైడ్ రైస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా?

కావలసినవి :
బాస్మతి రైస్ - 180 గ్రా.
పైనాపిల్ ముక్కలు - 50 గ్రా
జీడిపప్పు - 15 గ్రా
కిస్‌మిస్ - 10 గ్రా
కారం - 10 గ్రా
ఉప్పు - రుచికి తగినంత
ఉల్లికాడల తరుగు - 2 టీ స్పూన్లు
రిఫైన్డ్ ఆయిల్ - 15 ఎం.ఎల్
పండు మిర్చి తరుగు - టీ స్పూన్
వెల్లుల్లి తరుగు - టీ స్పూన్
బీన్స్ తరుగు - 30 గ్రాములు
పసుపు - చిటికెడు

తయారీ :
బియ్యంలో నీళ్లు పోసి పలుకగా ఉడికించాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసి, అన్నం ఆరబెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి, పోపుకు తగినంత నూనె వేసి, వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, పండుమిర్చి తరుగు, బీన్స్, క్యారట్ తరుగు వేసి కలపాలి. పోపు గింజలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం, అన్నం, పసుపు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలిపి, ప్లేట్‌లోకి
తీసుకోవాలి. వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, ఉల్లికాడలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి. ఈ పైనాపిల్ రైస్‌ను చికెన్ గ్రేవీతో గానీ, కడాయ్ పనీర్‌తో గానీ సర్వ్ చేయవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments