Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్ష పండ్లతో మాల్‌పూరి తయారు చేయడం ఎలా...?

Webdunia
FILE
ద్రాక్షపండ్లలో పోషకాలు చాలా వున్నాయి. ఆంటీ-యాక్సీడెంట్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ద్రాక్ష పండ్లను జ్యూస్, సలాడ్ల రూపంలోనే గాకుండా వంటల్లో కూడా చేర్చుకోవచ్చు. అలాంటి ద్రాక్షతో మాల్ పూరి ఎలా తయారు చేయాలో చూద్దామా.

కావలసిన పదార్థాలు :
ఆకుపచ్చ ద్రాక్షలు : 100 గ్రాములు
మైదా : ఒక కప్పు
పాలు : ఒకటిన్నర కప్పు
పచ్చి కొబ్బరి తురుము : అర కప్పు
పంచదార పొడి : నాలుగు టేబుల్ స్పూన్లు
స్వీట్‌కోవా : అరకప్పు,
బేకింగ్ పౌడర్ : అర టీ స్పూన్
యాలకుల పొడి : కొద్దిగా
రిఫైండ్ నూనె : వేగించడానికి సరిపడా
టూటీ ఫ్రూటీ, చెర్రీ, జీడిపప్పులు : కొన్ని

తయారీ విధానం :
ఒక గిన్నెలో మైదా, పాలు, బేకింగ్ పౌడర్, పంచదార వేసి గరిటతో జారుగా (దోసపిండిలా) కలపాలి. తరువాత ద్రాక్షల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసి ముందుగా తయారు చేసుకున్న పిండిలో కలపాలి. కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక ఒక గరిటెడు పిండిని పెనం మీద దోసెలా వేసి కాల్చాలి.

తరువాత ఒక పళ్లెంలో దోసెని ఉంచి దాని మీద కొద్దిగా కోవా, కొన్ని ద్రాక్ష ముక్కలు, జీడిపప్పు పెట్టి సగానికి మడవాలి. దానిపైన చెర్రీ, ద్రాక్ష పెట్టి, కొద్దిగా కొబ్బరి పొడి చల్లి సర్వ్ చేస్తే నోరూరించే మాల్‌పూరి రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments