Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమోటో ఓక్రా సూప్

Webdunia
కావలసిన పదార్థాలు :
బెండకాయలు... పావు కేజీ
టొమోటోలు... అర కేజీ
నూనె... వేయించేందుకు సరిపడా
బియ్యం... ఒక టీ.
మిరియాలపొడి... అర టీ.
ఉప్పు... తగినంత
వెజిటబుల్ స్టాక్... అర లీ.

తయారీ విధానం :
బెండకాయలను సన్నటి చక్రాల్లాగా కోసి నూనెలో వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్ స్టాక్‌ను మరిగించి, అందులో మెత్తగా గ్రైండ్ చేసిన టొమోటో గుజ్జును వేసి ఉడికించాలి. దోరగా వేయించిన బియ్యాన్ని పొడి చేసుకుని, మరుగుతున్న సూప్‌లో వేసి, బాగా కలిపి, చిక్కబడేంతదాకా ఉడికించాలి.

దించేముందు ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి... చివర్లో వేయించిన బెండకాయ ముక్కల్ని కూడా వేసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే టొమోటో ఓక్రా సూప్ రెడీ అయినట్లే...!

నోట్ : వెజిటబుల్ స్టాక్ ఇంట్లోనే చేసుకోవాలంటే, ముప్పావు లీటర్ నీటిలో ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు ఉల్లిపాయముక్కలు, అర అంగుళం దాల్చిన చెక్క, టీస్పూన్ మిరియాలు, పలావు ఆకు, కాస్తంత కొత్తిమీర వేసి గంటసేపు సన్నటి మంటమీద ఉడికిస్తే... వెజిటబుల్ స్టాక్ తయారవుతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments