Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో - తులసి సూప్‌ను ఎలా తయారు చేస్తారు!

Webdunia
File
FILE
సాధారణంగా వర్షాకాలం వచ్చేసిందంటే.. వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే, మనం తీసుకునే తిండిలోనూ మార్పులు వస్తుంటాయి. తేమ వాసన పెరిగే కొద్దీ వేడివేడిగా ఏమైనా లాగిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకే వెచ్చవెచ్చగా, ఆరోగ్యకరంగా ఉండే సూప్‌లను ఆరగిస్తే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. ఇపుడు టొమాటో తులసి ఆకులతో సూప్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

తయారీకి కావలసినవి : మూడు టేబుల్ స్పూన్లు తులసి ఆకులు, బాగా పండిన టమోటాలు నాలుగు, ఒక క్యారెట్, ఓ చిన్న దాల్చిన చెక్క, అర టీ స్పూన్ మిరియాల పొడి, నీళ్ళు నాలుగు గ్లాసులు, సరిపడినంత ఉప్పు కావాల్సి ఉంటుంది.

తయారీ విధానం : ముందుగా టొమాటో, క్యారెట్, దాల్చిన చెక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి ఉప్పు వేసి కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారాక బ్లెండ్ చేసి వడపోయాలి.

వడకట్టిన ద్రవంలో తులసి, మిరియాలు వేసి సన్నటి మంట మీద కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత సర్వింగ్ గిన్నెలోకి సూప్ తీసుకుని పైన మీగడ వేసి తులసాకులతో అలంకరించి తాగితే గొంతుకి హాయిగా ఉంటుంది. జలుబుని కూడా వదులుస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments