Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా మసాలా బజ్జీ ఎలా తయారు చేయాలి?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2012 (17:32 IST)
FILE
టమోటాను రోజూ తీసుకుంటే క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చును. అలాంటి టమోటాను వంటల్లో వాడటమే గాకుండా.. జ్యూస్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇంకా పిల్లలకు నచ్చాలంటే టమోటాలతో కాస్త మసాలా చేర్చి బజ్జీలుగా సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు.

కావలసిన పదార్థాలు :
టమోటాలు : 1/2 కేజీ
బంగాళాదుంపలు: 1/2 కేజీ
నూనె: వేయించేందుకు సరిపడా
గరంమసాలా: 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: 1 కప్పు
పెసరపప్పు: 4 టీస్పూన్లు
ఉల్లిపాయలు: 3
పచ్చిమిర్చి: 4
శనగపిండి: 1 కప్పు

తయారీ విధానం:
ముందుగా టమోటాలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును, బంగాళాదుంపలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. టమోటాల్లో గుజ్జు, విత్తనాలను తీసేసి పక్కనుంచాలి. తర్వాత ఉడికించిన పప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి.

ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో కూరాలి. ఈ టమోటాలను జారుగా కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే టమోటా మసాలా బజ్జీ రెడీ. వీటికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments