Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటా పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా..?

Webdunia
FILE
టమోటాను సిట్రస్ ఫ్రూట్ అంటారు. విటమిన్ సి పుష్కలంగా దాగివున్న టమోటాను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

టమోటాలో విటమిన్ సి మాత్రమే గాకుండా మేగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి. కూరల్లో మాత్రమే గాకుండా టమోటాలను సలాడ్స్, శాండ్‌విచ్, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. ఇంకా వేసవిలో టమోటా పచ్చడి వంటివి కూడా ట్రై చేయొచ్చు. మరి టమోటా పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :
టమోటాలు : ఒక కిలో
నూనె : తాలింపుకు సరిపడా
ఆవాలు : రెండు స్పూన్లు
జీలకర్ర : ఒక టేబుల్ స్పూన్
పచ్చి, ఎండు మిరపకాయలు : 15
కరివేపాకు : రెండు రెబ్బలు
శనగ పప్పు : 50 గ్రాములు
వెల్లుల్లి పాయలు : రెండు
ధనియాల పొడి : ఒక టేబుల్ స్పూన్
చింతపండు గుజ్జు : 50 గ్రాములు
ఉప్పు : తగినంత
మినపపప్పు : ఒక టెబుల్ స్పూన్

తయారు చేయు విధానం : ముందుగా టమోటాలు కడిగి ముక్కలు కోసుకోవాలి. నూనె వేడిచేసి ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, వెల్లుల్లి రేకులు, ధనియాల పొడి, చింతపండు గుజ్జు, ఉప్పు కలపాలి.

( విడిగా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, రెండు ఎండు మిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు తాలింపు కోసం ఉంచుకోవాలి.) తరిగిన టమోటో ముక్కలు వేసి ఐదునిమిషాలు వేయించి, చల్లారాక మెత్తగా రుబ్బుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగాక పచ్చడిలో పోసి కలియబెట్టాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments