Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లీ పనీర్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?

Webdunia
FILE
పనీర్ టైప్ టూ డయాబెటిస్‌ను దూరం చేస్తుంది. ఒబిసిటీ, హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది. బరువును తగ్గించే పనీర్‌‌లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఎముకలకు ఎంతో మేలు చేసే పనీర్‌తో చిల్లీ పనీర్ తయారు చేయడం మీకు తెలుసా అయితే ఇదిగోండి తయారీ విధానం ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు :

‌ పనీర్‌ - 200 గ్రాములు
పచ్చిమిర్చి - ఆరు
‌ కోడి గుడ్డు - రెండు.
‌ చిల్లీ సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను.
‌ నూనె - వేయించడానికి తగినంత.
‌ సన్నగా తరిగిన వెల్లుల్లి - ‌ఒక టేబుల్‌ స్పూను
మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు.
కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌ స్పూను
ఉప్పు - అర టీ స్పూను.
‌ అజనొమోటో - అర టీ స్పూను.

తయారీ విధానం :

ముందుగా పనీర్‌ను ఫ్రిజ్ నుంచి తీసి కాసేపయ్యాక పనీర్‌ను డైమండ్‌ ఆకారంలో ముక్కలు చేసుకోవాలి. అందులో మైదా, కార్న్‌ఫ్లోర్‌, కోడిగుడ్డు సొన వేసి కలపాలి. వీటి మిశ్రమం పనీర్‌ ముక్కలకు కోటింగ్‌గా పట్టేస్తుంది. ఇలా కలిపిన వెంటనే నూనె వేడిచేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి.

బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి వేడిచేసి సన్నగా తరిగిన మిర్చి, వెల్లుల్లి వేసి వేగిన తరువాత రెండు టీ స్పూన్ల నీళ్లు, ఉప్పు, అజనొమోటో, చిల్లీ సాస్‌ వేసి అన్నింటినీ దోరగా వేపుకున్న తర్వాత వేయించి వుంచిన పనీర్ ముక్కల్ని అందులో కలిపి ఐదు నిమిషాల తర్వాత దింపేయాలి. ఈ చిల్లీ పన్నీర్‌ను పిల్లలకు రోటీలకు గార్నిష్‌తో సర్వ్ చేస్తే చాలా ఇష్టపడి తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

Show comments