Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లీ పనీర్‌ ఎలా తయారు చేస్తారు?

Webdunia
సోమవారం, 8 జులై 2013 (17:31 IST)
File
FILE
చిల్లీ పనీరు ఎలా తయారు చేస్తారు. దాని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి అనే అంశాలను ఇక్కడ పరిశీలిద్ధాం. 250 పనీర్, 200 గ్రాముల కాప్సికమ్, 200 గ్రాముల ఉల్లిపాయలు, నాలుగు టమోటాలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల అల్లం, వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ పేస్ట్, సోయా సాస్, టొమాటో ప్యూరీ, ఒక టీ స్పూన్ చిల్లీసాస్, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర కప్పు నీళ్లు, రెండు కప్పుల నూనె, తగినంత ఉప్పును సిద్ధం చేసి ఉంచుకోవాలి.

తయారీ విధానం...
తొలుత, ఉల్లిపాయలు, కాప్సికమ్‌లను సన్నగా ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలి. పనీర్‌ను మనకు ఇష్టమైన సైజుల్లో (మరీ అంత పెద్దవి కాకుండా) కట్ చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్‌, పనీర్‌, ఉల్లిపాయ ముక్కలు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి.

నూనెను తిరిగి వేడి చేసి, దానిలో ఉల్లిపాయ పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో కారం, మిరియాల పొడి వేసి ఒక అర నిమిషం వేగనివ్వాలి.

అందులోనే చిల్లీ సాస్‌, సోయా సాస్‌ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్‌, పనీర్‌, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నుంచి నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించినట్టయితే చిల్లీ పనీర్ సిద్ధమైనట్టే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

Show comments