Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాబేజి కోఫ్తా కూర తయారు చేయడం ఎలా ?

Webdunia
బుధవారం, 23 జనవరి 2013 (18:37 IST)
FILE
క్యాబేజి కోఫ్తా కూర తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు :
క్యాబేజి తురుము - కప్పు
చిన్న ఉల్లిపాయలు - రెండు
పెద్ద ఉల్లిపాయ - ఒకటి (తరగాలి)
ఉప్పు, కారం - రుచికి తగినంత
గరంమసాలా - చెంచా
సెనగపిండి - కప్పు
లవంగాలు - రెండు
దాల్చిన చెక్క - చిన్నముక్క
యాలకులు - మూడు
అల్లం - చిన్నముక్క
జీలకర్ర, ధనియాలు, గసగసాలు - చెంచా చొప్పున
జీడిపప్పు - నాలుగైదు
పచ్చిమిర్చి - ఐదు
టమాటా - ఒకటి
కొత్తిమీర - అరకప్పు
పెరుగు - చెంచా
నూనె- వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం :
గిన్నెలో క్యాబేజి తురుము, ఉప్పు, కారం, గరంమసాలా, సెనగపిండి తీసుకొని కాసిని నీళ్లు చేర్చి గట్టిపిండిలా కలపుకోవాలి. ఇప్పుడు బాణిలో నూనె వేడి చేసి ఈ పిండిని ఉండల్లా వేసుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం, జీడిపప్పు, టమాటా ముక్కలు అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా ముద్ద చేసుకోవాలి.

మరో బాణలిలో జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఉల్లిపాయ తరుగు వేయాలి. ముక్కలు మగ్గాక మసాలా ముద్దను చేర్చాలి. కొద్దిసేపయ్యాక పెరుగు, ఉప్పు వేసి కాసిని నీళ్లు చేర్చి మూత పెట్టిమంట తగ్గించాలి. పదినిమిషాలయ్యాక గ్రేవీ చిక్కగా తయారవుతుంది. అందులో క్యాబేజీ కోఫ్తా ఉండల్ని వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. వేడి వేడి కోఫ్తా కూరను చపాతీ లేదా పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments