Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోకోనట్ పులావ్ ఎలా తయారు చేస్తారు?

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2013 (17:59 IST)
File
FILE
కోకోనట్ పులావ్‌ తయారీకి కావలసిన పదార్థాలు :
రెండు కప్పుల బియ్యం. ఒక కప్పు పచ్చి బఠానీ, మూడు పచ్చిమిర్చి, మూడు బిర్యానీ ఆకులు, మూడు యాలకులు, సరిపడిన ఉల్లిపాయలు, అల్లం, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క, నూనె, ఉప్పులు సరిపడా కావాల్సి ఉంటుంది.

ఎలా తయారు చేస్తారు?
బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి వార్చి ఉంచుకోవాలి. కొబ్బరి తురుము మిక్సీలో వేసి దాని నుంచి పాలు తయారు చేసుకోవాలి. కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున పాలు పోసి పక్కన పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ఫేస్టులా చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం పేస్ట్, మసాల దినుసులన్నీ వేసి వేయించాలి.

కొద్దిసేపటి తర్వాత పచ్చి బఠాణీ వేసి వేయించి అందులో బియ్యం, పాలు పోసి కొత్తిమీర, పూదీనా తరుగు వేయాలి. బాగా కలిపి మూతపెట్టి సన్నని సెగపై ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడకనివ్వాలి. స్టౌవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇది ఉల్లిపాయ, పెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది. అతిథులను ఇట్టే సంతృప్తి పరచవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments