Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోకోనట్ పులావ్‌ను ఎలా తయారు చేస్తారు?

Webdunia
ఆదివారం, 7 జులై 2013 (17:20 IST)
File
FILE
కోకోనట్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు
రెండు కప్పుల బాస్మతి బియ్యం, ఒక కప్పు పచ్చి బఠానీ, కొబ్బరి, బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి, యాలకులు, ఉల్లిపాయలు అల్లం, జీడిపప్పు, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీరలతో పాటు తగినంత ఉప్పు, దాల్చిన చెక్క, నూనె, లవంగాలను ముందుగా సిద్దం చేసి ఉంచుకోవాలి.

తయారీ విధానం..
ముందుగా బాస్మతి బియ్యాన్ని నీటితో శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. కొబ్బరి తురుమును మిక్సీలో వేసి దాని నుంచి పాలు తయారు చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసి ఫేస్టులా చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. తర్వాత కప్పు బియ్యానికి రెండు కప్పుల చొప్పున పాలు పోసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేసి కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం పేస్ట్, ఇతర మసాల దినుసులన్నీ వేసి దోరగా వేగేంత వరకు ఉంచాలి.

కొద్దిసేపటి తర్వాత పచ్చి బఠాణీ వేసి వేయించి అందులో బియ్యం, పాలు పోసి కొత్తిమీర, పూదీనా తరుగు వేయాలి. బాగా కలిపి మూతపెట్టి సన్నని సెగపై ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడకనివ్వాలి. స్టౌవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. దీనికి పెరుగు, ఉల్లిపాయలతో చేసిన పెరుగు పచ్చడి భేషుగ్గా ఉంటుంది.

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

ఏపీ ఎన్నికల ప్రచారంలో కనిపించని అలీ.. కారణం శివాజీయేనా?

జైలులో భర్త.. భర్త తమ్ముడితో పెళ్లి.. ఏడు నెలల పసికందు హత్య.. ఎలా?

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

తెలంగాణలో అత్యధికంగా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

Show comments