Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలీఫ్లవర్‌ రైస్‌‌ ఎలా తయారు చేయాలో తెలుసా?

Webdunia
FILE
కాలీఫ్లవర్‌లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9లు ఉన్నాయి. అంతేగాకుండా ప్రోటీన్లు, ఫాస్పరస్, పొటాషియంలు కూడా కలిగివుంది. అందుచేత వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను వంటకాల్లో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు. ఇలాంటి వంటల్లో క్యాలీఫ్లవర్ రైస్ ఎలా చేయాలో ట్రై చేసి చూడండి.

కావలసిన పదార్థాలు :
బాస్మతి రైస్ - నాలుగు కప్పలు.
క్యాలీఫ్లవర్‌ - ఒకటి.
పసుపు - ఒక టేబుల్‌ స్పూన్‌.
ఉల్లిపాయలు తరుగు - ఒకకప్పు
టమోటా తరుగు - ఒక కప్పు.
ఉప్పు - తగినంత.
ఆలుగడ్డలు - నాలుగు.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - ఆరు.
నూనె - సరిపడా

తయారీ విధానం :
ముందుగా బాస్మతి రైస్‌ను నూనె కొద్దిగా వేయించి కుక్కర్లో ఉడికించి పక్కనబెట్టుకోవాలి. అలాగే కాలీఫ్లవర్‌ను కూడా కాసింత ఉప్పు నీటిలో ఉడికించుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో ఆలుముక్కలను నూనెలో దోరగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత కాసింత నూనె వేసి, ఉల్లి, టమోటా తరుగును వేసి వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్టును, పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు చేర్చి., చివరిగా ఉడికించిన కాలీఫ్లవర్‌వేసి కలపాలి. తర్వాత ఉడికించిన రైస్‌లో ఈ మిశ్రమాన్ని కలపాలి.

చివరగా వేయించిన ఆలుగడ్డ ముక్కలు కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి చల్లుకుని వడ్డించుకోవాలి. ఈ రైస్‌ను చికెన్ గ్రేవీతో, కడాయి పనీర్, కడాయ్ చికెన్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments