Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుకూరలతో ఇడ్లీ తయారు చేయడం ఎలా?

Webdunia
FILE
ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి. వారానికి రెండు సార్లు ఆకుకూరలను తీసుకోవడం ద్వారా కంటిచూపు మెరుగవుతుంది. పిల్లల కంటి చూపు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చును. మొత్తానికి పిల్లలు చదివే ప్రాయంలోనే కళ్ళద్దాలు వేసుకోవడం నుంచి తప్పించుకోవాలంటే ఆకుకూరలు తినాల్సిందే. కానీ ఆకుకూరలంటే పిల్లలు వద్దంటున్నారా., అయితే ఆకుకూరలతో ఇడ్లీ తయారు చేసి చూడండి

ఆకుకూరలతో ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
మినప్పప్పు - కప్పు
ఇడ్లీ రవ్వ - రెండు కప్పులు
పచ్చిమిర్చి - నాలుగు
ఉప్పు - రుచికి తగినంత
తాలింపు దినుసులు - చెంచా
పాలకూర, బచ్చలికూర, తోటకూర - ఒక్కోటి రెండు కట్టల చొప్పున
కరివేపాకు - నాలుగురెబ్బలు
ఎండుమిర్చి - రెండు
పచ్చిమిర్చి - ఒకటి

తయారు చేయు విధానం :
ముందు రోజు ఉదయం మినప్పప్పు నానబెట్టుకోవాలి. సాయంత్రం రుబ్బుకొని రవ్వ, కలిపి పక్కన పెట్టుకోవాలి. మర్నాడు ఆకుకూరలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి ఆవిరి మీద ఇడ్లీలు ఉడికించాలి.

తరువాత బాణిలిలో చెంచా నెయ్యి వేసి ఎండుమిర్చి వేయాలి. అవి మగ్గాక ఆకుకూరల మిశ్రమం, ఉప్పు వేయాలి. పచ్చివాసన పోయే వరకూ ఉంచి దించేయాలి. ఇప్పుడు ఆవిరి మీద ఉడికిన ఇడ్లీలను ముక్కలుగా చేసి కూరలో వేయాలి. వేరే చట్నీ అవసరం లేకుండా తినేయవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Show comments