Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోడేలు వంటి క్రూర జంతువుల పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకుంటే...?

సాధారణంగా పెయింటింగ్స్‌తో ఇంటిని అలంకరించే అభిరుచి ఉంటే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొన్ని పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పెట్టుకుంటే చెడు జరుగుతున్నదని నమ్మకం. మ

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (11:51 IST)
సాధారణంగా పెయింటింగ్స్‌తో ఇంటిని అలంకరించే అభిరుచి ఉంటే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు కొన్ని పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పెట్టుకుంటే చెడు జరుగుతున్నదని నమ్మకం. మీరు ఇంట్లో పెట్టకూడని పెయింటింగ్స్ జాబితా చూడండి.
 
1. తాజ్‌ మహల్‌ ప్రేమకు చిహ్నమైనప్పటికీ షాజహాన్‌ భార్య ముంతాజ్ సమాధిగా నిర్మించబడింది. అది ఒక సమాధి కావడం వల్ల చెడు ఫలితాలు ఉంటాయని అందుకే ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. 
 
2. రామాయణ మహాభారతాల నుంచి యుద్ధ సన్నివేశాల పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి దాయాదుల మధ్య ఎప్పటికీ అంతం కాని పోరును సూచిస్తాయి.
 
3. పారే జలపాతం పెయింటింగ్స్‌గాని ఫౌంటైన్ పెయింటింగ్స్‌గాని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి పేదరికాన్ని సూచిస్తాయి. మీకు నచ్చిన సంపద గుర్తింపు ఎక్కువ కాలం నిలువకూడదు అని సూచిస్తాయి. 
 
4. మునుగుతున్న ఓడ పెయింటింగ్ ఇంట్లో ఉంచకూడదు. మునిగిపోతున్న ఓడ కుటుంబ సభ్యుల మధ్య అంతరాలను పెంచడం అనే అంశాన్ని సూచిస్తోంది. మీ దగ్గర ఇటువంటి పెయింటింగ్ ఉంటే వెంటనే విసిరేయండి.
 
5. సాధారణంగా నటరాజ పెయింటింగ్ ప్రతి క్లాసికల్ డ్యాన్సర్ ఇళ్ళలో ఉంటుంది. ఇది మంచి కళాత్మకంగా ఉన్నప్పటికీ వినాశనాన్ని సూచిస్తుంది. తాండవ నృత్యం అంటే వినాశనానికి నృత్యం అనే మశాన్ని సూచిస్తుంది. అందుకే నటరాజ విగ్రహం కానీ పెయింటింగ్ కాని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. 
 
6. ఏడుస్తున్న బాలుడు బాలిక పెయింటింగ్స్ ఈ మధ్య బాగా పాపులర్. అయితే ఇవి దురదృష్టానికి సూచికలు. అందువల్ల అటువంటి పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవద్దు. పళ్ళు, పూలు లేని చెట్లు, నగ్న చిత్రాలు, వేటాడే చిత్రాలు వంటివి ఇంట్లో పెట్టుకోకూడదు. ఇవి దురదృష్టానికి హేతువులు.
 
7. క్రూర జంతువులైన పులులు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు వంటి పెయింటింగ్స్ పెట్టుకోకూడదు. ఇవి మనుషుల్లో హింసా ప్రవృత్తిని సూచిస్తాయి. చూశారు కదా. అందువల్ల ఇటువంటి పెయింటింగ్స్ మీ ఇంట్లో ఉంటే బయట పడేయండి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments