వాస్తు ప్రకారం వాహనాల పార్కింగ్ దిక్కులు ఏవి?

Webdunia
శనివారం, 14 జూన్ 2014 (15:03 IST)
నానాటికి పెరిగిపోతున్న ఆధునిక నాగరికతకు అనుగుణంగా వాహనాల కొనుగోలు అధికం కావడంతో పాటు ప్రతి ఒక్కరూ, ద్విచక్ర వాహనాలు, కారు వంటి వాహనాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వాహనాల్లో అప్పుడప్పుడు ఏవో లోపాలు ఏర్పడటం గమనిస్తుంటారు. ఇలాంటి సమస్యలు పార్కింగ్ స్థలాన్ని ఎన్నుకోవడం ద్వారా కూడా ఉద్భవిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. దీని ప్రకారం పార్కింగ్ విధానంలో చేపట్టాల్సిన అంశాలను పరిశీలిస్తే... 
 
ఇంటికి ఉత్తరం, తూర్పు ప్రాంతాల్లో పార్కింగ్ దిక్కులుగా వాస్తు సూచిస్తోంది. దీని ప్రకారం వాహనాలను తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే వాహనాల్లో ఏర్పడే సమస్యలను అరికట్టవచ్చునని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే విధంగా ఉత్తరం, తూర్పు దిశల్లో ఎక్కువ కాలం పాటు వాహనాలను ఆపి ఉంచకూడదు. ఈ దిక్కులో వాహనాలను ఎక్కువ కాలంపాటు ఆపి ఉంచితే అప్పుడప్పుడు వాహనాల్లో లోపం ఏర్పడి లేని పోని సమస్యలకు దారి తీస్తాయి. అంతేకాకుండా ఆ వాహనాలను అమ్మే స్థితికి చేరుకుంటారు.
 
పాడయిన వాహనాలను తూర్పు. దక్షిణం, పశ్చిమం, దక్షిణ దిశలుగా ఆపవచ్చు. తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయకూడదు, అంతేకాకుండా నూనె, గ్రీస్ వంటి వాహనాలకు సంబంధించిన నూనె పదార్థాలు ఈ దిక్కుల్లో ఉండకూడదు. ఇంటికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో వాహనాలను నిలిపేందుకు షెడ్లను ఏర్పాటు చేయవచ్చు.  పైన పేర్కొన్న విధంగా వాస్తు ప్రకారం పార్కింగ్ ప్రాంతాలను ఎంచుకుంటే వాహన ప్రమాదాలను, వాహన లోపాలను ఎదుర్కోవచ్చునని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం

నెల్లూరులో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారుల గల్లంతు

వైకాపా నేతల పర్యటనలో రౌడీషీటర్లు : 3 కేసులు నమోదు

ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ ప్రకంపనలు : యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ ఆపరేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments