Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

సెల్వి
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (16:47 IST)
ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా లేకుంటే ఏంటోనని ఆందోళన చెందుతున్నారా? ఇంట్లోకి నల్లచీమలు రావడంపై ఏంటి ఫలితాలు అని తెలుసుకోవాలా? ఇంట్లోకి నల్ల చీమలు రావడం అదృష్టాన్ని ఇస్తాయా అనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
 
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్ల చీమలు తిరగడం మంచిదే అంటున్నారు. ఇంట్లోకి నల్లచీమలు రావడం శుభప్రదమని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇంట్లో గుంపుగా నల్లచీమలు కనిపిస్తే.. అది సంపదకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు త్వరలో తొలగిపోతాయనేందుకు గుర్తు. 
 
ఇంకా వాహన సౌఖ్యం, సంపద, ఇంట్లో ప్రశాంతత, ఆర్థిక వృద్ధి, సుఖసంతోషాలు చేకూరుతాయి. బియ్యం బస్తా దగ్గర నల్లటి చీమలు కనిపిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. బీరువాల పక్కన నల్లటి చీమలు తిరగాడితే.. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
ఇంకా చెప్పాలంటే నల్ల చీమలు దక్షిణ దిశవైపు నుంచి వస్తే.. ఆ ఇంట సంపదకు లోటుండదని వాస్తు చెప్తోంది. అలాగే ఉత్తరం వైపు నుంచి నల్ల చీమలు వస్తే భవిష్యత్తులో సుఖసంతోషాలకు ఢోకా వుండదని అర్థం. కానీ తూర్పు దిశలో నుంచి నల్ల చీమలు ఇంట్లోకి వస్తే చెడు వార్తలు వినే అవకాశం వుంది. పడమర దిశ నుంచి వస్తే ప్రయాణాలు తలపెడతారని అర్థమని చెప్తున్నారు.. వాస్తు నిపుణులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య నాడు జ్యోతిష్యం ప్రకారం ఈ యోగాలు

జూలై 23న మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం తోడైంది.. సాయంత్రం శివాలయంలో?

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments