గృహారంభానికి బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమం..

Webdunia
గురువారం, 25 జూన్ 2015 (17:59 IST)
గృహ నిర్మాణానికి బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమం. మాఘం వైశాఖం, కార్తీక మాసాలు మంచివని పంచాంగ నిపుణులు అంటున్నారు. విదియ, తృతీయ, పంచమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి తిధులు మంచివి.
 
అలాగే నక్షత్రాల విషయానికొస్తే... రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, పూర్వార్థం ఉత్తరాషాడ, ఉత్తరార్ధం, ఉత్తరాభాద్ర, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు అనుకూలిస్తాయి. లగ్నాల విషయానికి వస్తే.. వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నాలు ఉత్తమం. అలాగే చరలగ్నాలు మేష, కర్కాటక, తుల, మకరం మధ్యమం. లగ్నాధిపతి, చతుర్ధాధిపతి, అష్టమాధిపతి పరిపూర్ణ బలం గలవారై ఉండాలి.
 
అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉండకుండా పంచాంగ నిపుణులను సంప్రదించి.. గృహ నిర్మాణం చేపట్టాలి. అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు. అలా ఉంటే గృహ యజమానికి అరిష్టదాయకమని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 
 
శంకుస్థాపన లగ్నానికి శుభగ్రహాల బలం ఎంతగా కలిగినప్పటికీ సూర్యుడు-అంగారకుడు-శని తృతీయ-షష్టమ-ఏకాదశ స్థానాల్లో గానీ, ఉచ్ఛ-మూల త్రికోణ- స్వక్షేత్రాలలోగానీ ఉండాలి. లగ్నానికి 4-8 స్థానాల్లో ఏ గ్రహాలు ఉండకూడదు. 
 
శంకుస్థాపనకు మొదటి, రెండు, మూడో జాములు చేయవచ్చు. కానీ నాలుగో జామున మాత్రం చేయరాదు. ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేయడం ద్వారా దోషాలు చాలావరకు తొలగి, శుభ పరిణామాలు చేకూరుతాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్తగా పెళ్లైంది.. కొండపైనున్న ఆలయానికి వెళ్లారు.. కోతుల గుంపు.. భయంతో నవవధువు మృతి

రాజ్ ఘాట్ వంతెనపై నుంచి గంగలో దూకేందుకు మహిళ, కాపాడిన యువకుడు, వీడియో

ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు జంప్ అవుతున్న విద్యార్థులు

హైదరాబాదులో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ.. అపూర్వమైన గౌరవం.. ట్రంప్ కృతజ్ఞతలు

కాకినాడలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన.. హోర్డింగ్‌లు అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

Show comments