ఇంటికి ఆ దిశలో దిబ్బలు, రాళ్ల గుట్టలు వుంటే?

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (21:15 IST)
ఈశాన్యదిశయందు దిబ్బలు, పేడకుప్పలు, రాళ్ళ గుట్టలు మొదలైనవి కల్గియున్నట్లైతే సుఖహీనత, నీచప్రవర్తన, విరోధములు, ఆయుక్షీణములు సంభవించి దరిద్రులు కాగలరు. ఈశాన్యము మెరక కల్గియున్నను, పల్లముగానున్నను అందుపాకలు, పందిళ్లు ఇతర కట్టడములు, బరువులు కల్గియున్న - దరిద్రము, కీడు, భార్యలేక గృహయజమానురాలికి తీవ్ర అనారోగ్యము, పుత్రనష్టము సంభవింపగలదు.
 
ఈశాన్యమునందు బావియుండుట ఐశ్వర్యప్రదము. వర్షపు నీరు, వాడుకనీరు పోవు కాల్వలు, గోతులు, జలాశయములు యుండుట వలన వంశవృద్ధి కల్గి, ధనదాన్య సంపదలు వృద్ధినందగలవు. ఈశాన్యంలో నీళ్ళకుండీలు భూమట్టమునకు తక్కువగా నిర్మించుకొనవచ్చును. వాటర్‌టాంక్‌లు నిర్మింపరాదు. మరుగుదొడ్లు నిర్మించిన యెడల కుటుంబకలహములు, నష్టములు, సంతతికి కీడు కలుగ గలదు.
 
ఈశాన్యదిశయందు స్థలము పెరిగి పల్లముగా నుండుట వలన సర్వశుభములు ప్రాప్తించగలవు. ఈశాన్యస్థలమునకు ఈశాన్య మందు ఇతరుల స్థలములు ఈ స్థలమునకన్న మించియున్న యెడల ధననాశనము, వంశహాని సంభవింపగలదు.
 
ముఖ్యముగా స్థలమందుగానీ, గృహమందుగానీ, గదులలో గానీ ఈశాన్యమూలన ఏ విధములైన కట్టడములు నిర్మించుట ద్వారములుండుట, బరువులుండుట మొదలైనవి శాస్త్ర విరుద్ధము. ఈశాన్యమందు ఖాళీగా వుంచుట శ్రేయస్కరము. ఈశాన్యదిశ పల్లము కల్గియుండు నట్లు గృహనిర్మాణ మొనర్చినట్లైతే అఖండ ఐశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

అన్నీ చూడండి

లేటెస్ట్

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

తర్వాతి కథనం
Show comments