Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుందా? ఐతే త‌రిమి కొట్టండిలా... సంతోషాలు నింపండి

ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలనే అనుకుంటారు. తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్య, పిల్లలు.... ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటివరకు సంతోషం

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (13:46 IST)
ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలనే అనుకుంటారు. తల్లితండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, భార్య, పిల్లలు.... ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటివరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. మీ ఇంట్లో ఉన్న పద్ధతులే ఇలా జరగడానికి కారణమై ఉండచ్చు. మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి కారణమై ఉండవచ్చు. ఇలాంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూడండి. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే ఇవి పాటించండి!!
 
* ఇంట్లోవారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
 
* అన్నిటికి తప్పుబడుతున్నారా? మీ ఇంట్లోవారు ఏ పని చేసినా అందులో తప్పులు వెతకడం.. లేదా మీపై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
 
* తరచుగా ఎవరో ఒకరిపై చిన్నచిన్న వాటికి కంప్లైంట్ చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
 
మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నిండటానికి కారణాలు ఏంటో చూడండి:
 
* ఇంట్లో వస్తువులు గాని, బట్టలు గాని ఎలాపడితే అలా వదిలేయకూడదు. వాటిని సక్రమంగా అమర్చుకోవాలి. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
 
* మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని వెంటనే తినేయండి. చేతులో పట్టుకొని అటూఇటూ తిరిగితే నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
 
* మురికి బట్టలు ధరించకూడదు. వీటివల్ల క్రిములు రావడమే కాకుండా వాస్తు ప్రకారం ఈ బట్టలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
 
* ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురుబొదురుగా అస్సలు ఉంచకూడదు. వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగా ఉంచాలి. పక్కపక్కన పెట్టచ్చు గాని ఎదురుబొదురుగా పెడితే నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
 
నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమికొట్టాలో చూడండి:
* ఓ గుప్పెడు రాయి ఉప్పు లేదా దొడ్డు ఉప్పుని అన్ని రూమ్ మూలలలో పెట్టండి. 48 గంటల తరువాత దాన్ని తీసేయండి. నెగటివ్ ఎనర్జీ తరిమికొట్టడంలో రాయి ఉప్పు బాగా పనిచేస్తుంది. కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కలపండి.
 
* ఇంటిని, ఇంట్లో వస్తువులని పైపైన దులపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, కార్పెట్స్.. ఇలా అన్నిటిని కనీసం రెండు వారాలకొకసారైనా శుభ్రపరుచుకోండి.
 
* పాత పుస్తకాలు, దుస్తులు లాంటివి ఉంచుకోకండి. కుదిరితే ఎవరికైనా దానం చేయండి. ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
 
* నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది. కాని అప్పుడప్పుడు ఫుల్ సౌండ్‌తో పాటలు వినడం లేదా సినిమా చూడడం లాంటివి చేస్తే నెగటివ్ ఎనర్జీ అక్కడనుండి పారిపోతుంది.
 
*తరచుగా మీ ఇంటి కిటికీలను తెరుస్తూ ఉండాలి. ఈగలొస్తాయి. దోమలొస్తాయి అని అలా చేయకుండా ఉండకండి. ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
 
* మెడిటేషన్ చేస్తే కేవలం మన శరీరమే కాదు... మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి. దీంతో మీ ఇంటిపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఇంట్లో సూర్యకాంతి పడే మంచి స్థలం చూసుకొని అక్కడ మెడిటేషన్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది.
 
* ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ కాండిల్స్ వెలిగిస్తూ ఉండాలి. ఇది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది.
 
* మీ ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ఎల్లప్పుడు ఒకే దగ్గర పెట్టకుండా వీలైతే మరొక చోటకి మార్చండి. సోఫాల పైన ఉన్న క్లాత్‌ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
 
* హాల్‌లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఇల్లంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇంట్లో చెట్లని చూస్తే మీ ఆలోచనలు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి.
 
* ఇంట్లో అక్కడక్కడ వెల్లులి రెమ్మలను తగిలించండి. ముఖ్యంగా మెయిన్ డోర్‌కి తగిలిస్తే ఆత్మలు, దెయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయి.
 
* క్రిస్టల్స్‌ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడతీయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని రాకుండా చేస్తాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments