తులసి మొక్కను నాటక పోతే.. ఏమవుతుంది..?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:33 IST)
తులసి మొక్కను వాస్తురీత్యా ఒక్క ఈశాన్యంలో తప్ప గృహం యందు ఎక్కడైనా ఉంచుకోవచ్చును. తులసిని గృహమునకు పశ్చిమం లేదా దక్షిణం యందు ఉంచుకోవడం చాలా మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. తులసిని బృందావనంలో నాటుకుని చుట్టూ ప్రదక్షిణ వచ్చేలా చేసుకోవడం శ్రేయస్కరం. 
 
శ్రీకృష్ణునికి ప్రీతి పాత్రమైన, ఆరాధ్య మొక్కగా పరిగణించే తులసిని మొక్కే కదా అని తీసి వేయరాదు. ఈశ్వురునికి బిల్వ పత్రం సమర్పించినట్లే శ్రీకృష్ణునికి తులసి మొక్కను సమర్పించి పూజిస్తారు. పూర్వ కాలంలో తులసి బాగుంటే ఇంటి యందు కీడు జరుగలేదని, తులసి వాడిపోయి... రాలిపోయి ఉంటే ఇంట కీడు జరగడానికి అవకాశం ఉందని నమ్మేవారు. 
 
అందుచేత ఇంటి యందు తులసిని పెంచుకోని వారు తక్షణమే వెళ్ళి తులసి మొక్కను నాటుకోవాలి. ఆరోగ్య రీత్యా కూడా తులసి చాలా మంచిది. విశిష్టమైన గుణాలు కలది. చివరికి తులసి గాలి సోకితేనే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 
 
ఇటువంటి బృహత్తర శక్తి గల తులసిని ప్రతి దినం నీరు పోసి పూజించండి. తులసికి పూజ చేసే రెండు నిమిషాలైనా తులసి పక్కన ఉన్నట్లైతే ఎంతో మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కె.అన్నామలై 'ఉయ్ ద లీడర్స్' ఉద్యమానికి భారీ స్పందన - 24 గంటల్లోనే 14 లక్షల మంది సపోర్టు

భూ వివాదం.. వేట కొడవళ్లతో మహిళపై దాడి..ఎక్కడ?

గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరా? మంత్రి నారా లోకేశ్ ఫైర్

గొడ్డలి పార్టీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టబోం : సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఒక భోజనం జీవితాలను మార్చగలదు: మలబార్ గ్రూప్ యొక్క హంగర్ ఫ్రీ వరల్డ్

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2026 శనివారం ఫలితాలు - సర్వత్రా మీదే పైచేయి

శ్రీవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం

05-06-2026 శుక్రవారం ఫలితాలు- రావలసిన ధనాన్ని చాకచక్యంగా రాబట్టుకోవాలి

హనుమంతుడు అక్కడే వుంటాడు

Vibhuvana Sankashti 2026: విభువన సంకష్టి చతుర్థి.. గరిక, బిల్వ పత్రాలతో పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments