ఆస్తులు అధికంగా చేరాలంటే వాస్తు ప్రకారం 41 అడుగుల పొడవు, 41 వెడల్పు ఇంటి స్థలాన్ని కలిగి ఉండాలని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఇటువంటి స్థల అమరికతో ఆస్తులను సంపాదించడంతో పాటు ఇంటి యజమానికి అనేక విధాల అనుకూలిస్తుందని వారు చెబుతున్నారు.
ఇంటిలో సుఖసౌఖ్యాలు ఎప్పటికీ స్వస్థలంగా ఉంటాయని వారి సూచన. 40 అడుగుల పొడవు, 40 అడుగుల వైశాల్యం ఉన్న ఇంటి స్థలాన్ని కలిగి ఉంటే భయం, వేదనలు మానసిక కలత, దారిద్ర్యం వంటివి చేరువవుతాయి.
జీవితంలో ప్రశాంతత లభించదు. అంతేకాకుండా ఇంటి సుఖసంతోషాల్లో లోకువ తటస్థిస్తుంది. 41,41 స్థలంలో ఇంటిని నిర్మిస్తే జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. నూతన వస్తువులను కొనడం, వృత్తిలో అభివృద్ధిని సాధించడం వంటివి జరుగుతాయని వాస్తుశాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.