Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తుప్రకారం భూ పరీక్ష!

Webdunia
గురువారం, 10 జులై 2008 (18:06 IST)
WD
గృహనిర్మాణం చేయడానికి ముందు భూమిని ఓ సారి పరీక్షించి తర్వాతే ఇంటి నిర్మాణం చేపట్టాలని వాస్తునిపుణులు అంటున్నారు. గృహ నిర్మాణంలో భూపరీక్ష చాలా ముఖ్యమైందని వారు అంటున్నారు. వాస్తునిపుణుల సూచనల మేరకు గృహనిర్మాణంలో భూపరీక్ష నియమాలు కొన్నింటిని పరిశీలిద్దామా... గురువింద, మల్లె, మోదుగ, తెల్లగన్నేరు, అరటి, పనస వంటి వృక్షములు సస్యశ్యామలంగా ఉన్నట్లైతే ఆ భూముల్లో ఇంటి నిర్మాణం చేయొచ్చు.

అదే విధంగా ముంగిసలు, కుందేళ్లు, చక్రవాకములు, తోడేళ్ళు, పిల్లులు, గోవులు, ఉడుతలు వంటి పక్షి సంతతి తిరుగుతుండే భూములు కూడా గృహనిర్మాణానికి శ్రేష్టమైనవని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.

ఇలాంటి ప్రాంతాల్లో ఇంటినిర్మాణం చేపట్టినట్లైతే సర్వశుభాలు చేకూరుతాయని వారు అంటున్నారు. అంతేకాకుండా అన్నవస్త్రములు, ఆయురారోగ్యములు, సకలార్థసంపదలు ఆ గృహంలో నివసించే వారు కలిగి ఉంటారని వారు పేర్కొంటున్నారు.

అయితే చీమల, పాముల పుట్టలు, కప్పలు, ఎముకలు, బూడిద, కాలిపోయిన వస్తువులు గల భూములయందు గృహనిర్మాణములు చేపట్టరాదు. అలా నిర్మించినట్లైతే మరణ-రోగములు కలుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా గోరీలు, సమాధులు, ముండ్లుగల వృక్షములుండుట, బీటలు వారి ఉండుట వంటి భూములు కూడా ఇంటినిర్మాణానికి పనికి రావని వారు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments