Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహ ప్రవేశం చేస్తున్నారా? ముహూర్తం చూసుకోండి?

Webdunia
గృహప్రవేశానికి ఉత్తరాయణం మంచి ముహూర్తకాలమని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు గృహ ప్రవేశానికి ఉత్తమమని వారు చెబుతున్నారు. ఇంకా కార్తీక, మృగశిర మాసాలు మధ్యమ ఫలప్రదాలు. మిగిలిన మాసాల్లో నూతన గృహ ప్రవేశం పనికి రాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో గృహ ప్రవేశం చేయడం శుభప్రదం. అయితే ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.

అదేవిధంగా చవితి, నవమి, చతుర్థీ తిథులను విడిచిపెట్టి, పౌర్ణమి, సప్తమి, అష్టమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లి విరుస్తాయి. ఇంకా.. శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు కూడా గృహప్రవేశం చేయడానికి మంచి ముహూర్తములని వాస్తు చెబుతోంది.

ఇకపోతే... సింహద్వారాన్ని అనుసరించి కూడా గృహప్రవేశ ముహూర్తాలను నిర్ణయించుకోవచ్చునని వాస్తునిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా.. దక్షిణ సింహద్వారము గల గృహమునకు పాడ్యమి, షష్టి, ఏకాదశి తిథులు మంచివి.

అదేవిధంగా తూర్పు సింహద్వారం కలిగిన గృహానికి పూర్ణ తిథులైన పంచమి, దశమి, పూర్ణిమలు శుభప్రదం కాగా, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథుల్లో గృహ ప్రవేశం చేయడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

Show comments