ఇంటి నిర్మాణంలో గదుల ఏర్పాటు దిశల వారీగా జరగాలని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం గృహంలో ఏ దిశలో ఏ గదిని ఏర్పాటు చేసుకోవాలనే నియమాల్లో కొన్ని మీ కోసం... ఈశాన్య దిశలో పూజగది ఉండాలి. తూర్పున బాత్రూం, ఆగ్నేయంలో వంటగది ఉండాలని వాస్తు చెబుతోంది.
అదే విధంగా, దక్షిణ దిశలో పడకగది, దక్షిణ నైరుతి దిశల మధ్య మరుగుదొడ్డి, నైరుతిలో ఆయుధాల గదిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
ఇకపోతే... పడమర దిక్కున భోజనాల గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. భోజనాల గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోలేని పక్షంలో పడమర దిక్కున డైనింగ్ టేబుల్‌ను అమర్చుకోవడం శుభప్రదం.
పశ్చిమ నైరుతి దిశల మధ్య రీడింగ్ రూమ్, వాయువ్య దిశలో పశుశాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటుంది.
ఉత్తర దిశన ధనాగారం ఉండాలని, ఈ దిశలో బీరువాలు, బంగారు, రుణాలను దాచే సూట్‌కేసులను ఉంచితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.