Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎల్" ఆకారంలో ఇంటి నిర్మాణం మంచిది కాదు

Webdunia
చతురస్ర, దీర్ఘ చతురస్ర ఆకారంలో మాత్రమే ఇంటిని, అపార్ట్‌మెంట్‌లను నిర్మించాలని వాస్తుశాస్త్రాలు చెబుతున్నాయి. పై ఆకారాల్లో ఇళ్లను నిర్మించని పక్షంలో ఆ గృహాలపై విషవాయువుల ప్రభావం ఉంటుందని వాస్తునిపుణలు పేర్కొంటున్నారు. అందుచేత ఇళ్లు, అపార్ట్‌మెంట్, కార్యాలయాల నిర్మాణంలో వాస్తు ప్రకారం ఒకవిధమైన షేప్‌పై ఆధారపడటం మంచిది.

చతురస్ర, దీర్ఘచతురస్ర ఆకారాల్లో గాకుండా నిర్మాణానికి పరిమితంలేని విధంగా ఇళ్లు ఉంటే అశుభ ఫలితాలు తటస్థిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. హద్దుదాటి నిర్మించిన గృహం, సీత గీత దాటిన చందంగా ఉంటుందని వారు చెబుతున్నారు.

అందుచేత గృహాలు నిర్మించటంలో జాగురూకతతో వాస్తు ప్రకారం షేప్‌ను పాటించి నిర్మించటం మంచిది. ప్రస్తుతం మీ ఇల్లు 'ఎల్' ఆకారంలో ఉంటే ఇంటిలోని గదులు అలాగే నిర్మించటం అంత మంచిది కాదు. రెండు ఎల్‌షేప్‌లు కలవడం కూడదు. రెండు ఎల్‌షేప్‌లు కలిసి దీర్ఘచతురస్రాకారం కావడం చేస్తుంది.

అయితే ఒక 'ఎల్‌' షేప్ మాత్రమే వాస్తుశాస్త్రంలో అసంపూర్ణత చిహ్నంగా శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. దీనితో నిర్మాణంలో అసంపూర్ణత లోపిస్తుంది. అందుచేత మన గృహాలకు సహాయాన్ని అందించే ప్రకృతి సిద్దమైన శక్తులను దూరం చేసుకునే పరిస్థితి కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇప్పటికే మీ ఇళ్లల్లో 'ఎల్‌' ఆకారముంటే ఆ ఆకారాన్ని మార్చేవిధంగా దీర్ఘ చతురస్రం వచ్చేలా స్థలానికి ఒకమూల మొక్కను గాని, లేదా ఏదైనా పోల్‌ను నిర్మించటం మంచిది. ఇలా చేస్తే కొంత దుష్ర్పయోజనాల నుంచి దూరంగా ఉండవచ్చునని వాస్తుశాస్త్రం చెబుతోంది.

కాబట్టి ఇంటి నిర్మాణం చతురస్రం, లేదా దీర్ఘచతురస్ర ఆకారాన్ని మాత్రమే కలిగియుండాలి. అలా లేని పక్షాన విద్యా విషయంలో సమస్యలు ఏర్పడటం, కుటుంబంలో భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని వాస్తుశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments