Webdunia - Bharat's app for daily news and videos

Install App

843 అమ్మాయిలకు రోజా పువ్వులిచ్చిన విద్యార్థి: నా లవర్ గ్రేట్ అన్న ప్రేయసి!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (15:13 IST)
అమెరికాలో ఓ విద్యార్థి వెరైటీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేశాడు. తాను చదువుకుంటున్న స్కూళ్లో ఉన్న అమ్మాయిలకు వాలెంటైన్ డే శుభాకాంక్షలు హార్ట్ టచ్ అయ్యేలా చెప్పాడు. ఒక్కరిద్దరికి కాదు ఏకంగా స్కూళ్లో ఉన్న 843 మంది అమ్మాయిలకు ఫ్లవర్స్ బహుమతిగా ఇచ్చి అందరిని అబ్బురపరిచాడు.
 
అమెరికా రాష్ట్రంలోని ఉటాహ్ రాష్ట్రంలోని స్మిత్‌ఫీల్డ్‌లో హేడన్ గాడ్‌ఫ్రే చదువుతున్నాడు. వాలెంటైన్ డేకు మూడు రోజుల ముందే మొత్తం 900 ఫ్లవర్స్‌తో స్కూల్‌కు వచ్చాడు. ఆ స్కూళ్లో ఉన్న అమ్మాయిలందరికీ గులాబీలు ఇచ్చి వాలెంటైన్ డే శుభాకాంక్షలు చెప్పాడు. దాదాపు 20 రోజుల ముందే ఆన్‌లైన్‌లో పువ్వల కోసం గాడ్‌ఫ్రే ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌ సహాయంతో వాటిని గిఫ్ట్‌లుగా రూపొందించాడు. గురువారం ఆ పువ్వులను ట్రక్కులో తరలించి స్కూళ్లో ఉన్న అమ్మాయిలందిరికీ వాలెంటైన్ డే గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. గాడ్‌ఫ్రే ఇచ్చిన గులాబీ పువ్వులు అమ్మాయిలను ఎంతగానో ఆకర్షించింది.
 
ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అతని లవర్ కూడా అదే స్కూల్‌లో చదువుతోంది. బాయ్‌ఫ్రెండ్ చేష్టలకు 18 ఏళ్ల లిల్లీయాన్ షార్ప్ అసూయ పడలేదు. తన లవర్ మంచి పని చేశాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. వాలెంటైన్ రోజున ప్రతి అమ్మాయి ముఖంలో చిరునవ్వును తీసుకొచ్చిన తన లవర్ గ్రేట్ అని తెగ సంబరపడిపోయింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

Show comments