ప్రేమికుల రోజున ఫెంగ్‌షుయ్ ప్రకారం ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాలంటే..
చిన్నదైన లవ్లీ వాటర్ ఫౌంటైన్ ఇవ్వొచ్చు. పనిచేసే రీతిలో ఉండాల్సిన ఈ ఫౌంటైన్ నుంచి మెల్లగా వచ్చే సంగీతం ఉంటే ఇంకా మంచిది. ఈ లవ్లీ వాటర్ ఫౌంటైన్ ఇవ్వడం ద్వారా మీ ప్రేమ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అలాగే ఇండోర్ విండ్ చిమ్ ఇవ్వడం ద్వారా అందులో నుంచి వెలువడే రొమాంటిక్ మెలోడీ శబ్దాలు మీ ప్రేమకు మీ నుంచి మీ ఇంటి నుంచి పాజిటివ్ శక్తిని ఇస్తుంది.
అలాగే మ్యూజిక్ సీడీ కూడా ఇవ్వొచ్చు. సంగీతంతో కూడిన విండ్ చిమ్‌లు, వాటర్ ఫౌంటైన్‌లు ఇవ్వడం ద్వారా ప్రేమకు ప్రోత్సాహకరమైన సందేశం పంపినట్లవుతుంది. ఇక మీ ప్రేమ భాగస్వామికి సంప్రదాయక కానుకను అందజేసినట్లైతే మీరిచ్చే గిఫ్ట్ జీవితంలో ఎన్నడూ మరిచిపోనట్టుగా ఉండాలి. ఈ క్రమంలో మీ ప్రేమ భాగస్వామికి ఇండోర్ ప్లాంట్స్, రోజా పుష్ప గుచ్ఛాలు ఇవ్వడం చేయొచ్చు.
ఇంకా మీ భాగస్వామికి నచ్చిన మంచి ప్రదేశానికి తీసుకెళ్లడం. దీనికోసం మీ ఇద్దరికి కలిసి సీజన్ టిక్కెట్స్ కొనడం, మంచి సినిమా టిక్కెట్స్ తీసుకుని అద్భుతమైన గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడం ద్వారా మీ భాగస్వామి మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. ఒకవేళ మీ ప్రేమ భాగస్వామి చాక్లెట్ ప్రియులైతే భారీ చాక్లెట్ బార్‌ని గిఫ్ట్‌గా ప్యాక్ చేసి ఇవ్వొచ్చు. ఇలా చేస్తే మీ భాగస్వామి మీ ప్రేమను స్వీకరించేందుకు ఆస్కారముంది.
అలాగే పడకగదిలో ప్రేమికులు ఆగ్నేయ దిశను ఎంచుకోవడం మంచిది. ఒకే సైజుగల పువ్వులను అలంకరణ కోసం వాడుకోవచ్చు. ప్రేమ ప్రేమపావురాలతో కూడిన పటాలను ప్రధాన ద్వారం వద్ద తగిలించడం చేయాలి. లేదంటే మీ కంటికి కనిపించే విధంగా ప్రేమ పావురాలు కలిగిన ఫోటోను తగిలించుకోవచ్చు. అలాగే హృదయ సంబంధిత రెండు చిత్ర పటాలను మీ ప్రేమ భాగస్వామి కంట పడేలా తగిలించాలి.
ఇలా ఫెంగ్‌షెయ్ సూచనల మేరకు మీ పడకగదిని సుందరంగా అలంకరించి మెప్పించవచ్చు. ఇంకా తూర్పు దిశలో చిన్న చిన్న మొక్కలను ఏర్పాటు చేయడం ద్వారా ఓ కొత్త బంధం మొలకెత్తడం జరుగుతుంది. అలాగే ప్రేమికుల రోజున మీ భాగస్వామికి మంచి డిన్నర్ ఏర్పాటు చేయొచ్చు. పిక్నిక్‌కు తీసుకెళ్లడం లేదా పార్టీ ఇవ్వడం చేస్తే తప్పకుండా మీ భాగస్వామి మీ ప్రేమకు పచ్చజెండా ఊపుతుంది.