Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 14ను అమ్మా-నాన్నల రోజుగా జరుపుకోండి: శ్రీరామ్‌సేన

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2012 (16:32 IST)
WD
వాలంటైన్స్ డే జరుపుకోవడానికి ప్రేమ జంటలు ఆ రోజు కోసం ఎలా ఎదురుచూస్తున్నాయో కానీ, శ్రీరామ్‌సేన మాత్రం ఆ రోజు కోసం పకడ్బంధీగానే ఎదురుచూస్తోంది. ఆ రోజు జరిగే అసభ్య కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఇప్పటి నుండే తన కార్యకర్తలను సిద్ధం చేస్తున్నానని చెపుతోంది.

14 వ తేదీన దేశంలో ప్రేమ పేరుతో పబ్లిక్‌గా పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో వేసే వెకిలీ వేషాలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరికలు కూడా జారీ చేసింది. వాలంటైన్స్‌ డేను ఒక పక్కదోవ పట్టిన పాశ్చాత్య సంస్కృతిగా శ్రీరామ్‌సేన అభివర్ణించింది. దాంతోపాటు పనిలో పనిగా, మన దేశంలో ఫిబ్రవరి 14ను అమ్మా-నాన్నల రోజుగా జరుపుకోవాలంటూ కూడా హితోక్తులు పలికింది.

" జమ్మూకాశ్మీర్‌తో పాటు, దేశంలోని తల్లిదండ్రులు, యువతరం మొత్తానికి ఇదే మా విన్నపం.. దయచేసి వేలంటైన్స్ డేను అమ్మా-నాన్నల దినోత్సవంగా జరుపుకోండి," అంటూ సేన జమ్మూ అధ్యక్షుడు రాజీవ్ మెహతా కోరారు. ప్రేమ పేరుతో జరిగే వెకిలీ వేషాలను మా కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారని భావించకండి, మా వాళ్లు దీన్ని నిరోధించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ హెచ్చరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

Show comments