Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన ప్రేమకు అనుబంధం పునాది!

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2014 (15:11 IST)
File
FILE
ప్రేమ అని చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే అంశాలు కొన్ని ఉంటాయి. వయస్సులో ఉన్న ఇద్దరు ఆడామగా కలిసి చెట్టూ పుట్టా తిరుగేస్తుంటారు. అలాగే ఒకరి కళ్లలో ఒకరు కళ్లు పెట్టి చూసుకుంటూ బాహ్య ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. ఇవేవీకాకపోతే శూన్యంలో పిచ్చి చూపులు చూస్తూ తన ప్రేయసి లేదా ప్రియుడి గురించే నిత్యం తపిస్తూ ఉంటారు.

ఇలాగే కాకున్నా ప్రేమ అంటే చాలామందికి టక్కున గుర్తొచ్చే అంశాలు ఇవే. అయితే ప్రేమ ప్రారంభంలో ప్రతి ఒక్కరిలో ఇలాంటి లక్షణాలే ఉన్నా ఓ ఆడా మగ మధ్య పుట్టిన ప్రేమ భవిష్యత్‌లో కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండాలంటే మాత్రం వారి మధ్య అనుబంధం అనేది ఏర్పడాలి. అలా అనుబంధం అనే పునాది ఏర్పడితే ప్రేమ అనే బంధం చెక్కు చెదరకుండా జీవిత పర్యంతం కొనసాగుతుంది.

ప్రేమలో పడ్డ కొత్తల్లో ఎదుటివారిపై కలిగేది వ్యామోహమో, ప్రేమో ఖచ్చితంగా గుర్తించడానికి వీలుకాదు. వారినే పదే పదే చూడాలనుకోవడం, వారు కనబడగానే దేహంలో ఏదో కొత్త ఉత్తేజం అడుగు పెట్టడం, మనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చిగురించడం లాంటి లక్షణాలన్నీ ప్రేమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అందరిలోనూ కన్పించేవే.

అయితే ఎదుటివారిపై ఉన్నది ప్రేమ కాకుండా వ్యామోహమైనా కూడా దాదాపు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. అయితే కొద్దిరోజులు నిదానించగల్గితే ఎదుటివారిపై కలిగిన ఆకర్షణలో కొంత ఖచ్చితత్వం వస్తుంది. ఎలాగంటే ఎన్నిరోజులు గడిచినా తొలిరోజు కలిగిన ఆకర్షణ అలాగే కొనసాగగల్గితే అలాంటివారిలో ప్రేమభావం ప్రవేశించిందన్నమాటే. అలాకాక కొన్నాళ్ల తర్వాత వారిని చూచినపుడు కల్గినంత వ్యామోహం వాళ్లు ఎదురుగా లేనపుడు కలగకపోతే అది ఖచ్చితంగా ప్రేమకాదు.

ఎందుకంటే మనసులో ఆకర్షణతో పాటు ప్రేమ కూడా ఉంటే మీ మనసుదోచినవారు ఎదురుగా లేకున్నా ఊహల్లో మాత్రం మీరు వారితోనే విహరిస్తుంటారు. ఇలాంటి స్థితిలో ఎదుటివారికీ ఇదే పరిస్థితి ఉండి వారూ మీ ప్రేమకు పచ్చ జెండా ఊపారంటే మీ ప్రేమ కావ్యంలో రెండో దశ ప్రారంభమవుతుంది.

ఈ స్థితిలో మీలో ఉన్న భావాలు, ఆవేశాలు, ఆలోచనలు, కోర్కెలు ఇలా ప్రతి ఒక్కదాన్ని మీ ప్రేమికుడు లేదా ప్రేయసితో పంచుకుంటారు. సామాజికంగా మీ మధ్య ఉన్న తారతమ్యాలు, వ్యత్యాసాలు ఈ స్థితిలో మీకు గుర్తుకురావు. మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా అందుకోసమే బ్రతుకుతున్నట్టుగా జీవిస్తుంటారు.

అయితే ఈ దశ తర్వాత కూడా మీ ప్రేమ కొనసాగాలంటే ప్రారంభంలో చెప్పినట్టు మీ మధ్య అనుబంధం అనే స్థితి ఏర్పడాలి. ఈ స్థితిలో మీరు దాదాపుగా ప్రేమికులుగా కాక జీవిత సహచరులుగా, పెళ్లికాని భార్యాభర్తలుగా భావించేసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వీరు మాత్రమే నా జీవిత భాగస్వామి అనే దశకు చేరుకుంటారు.

ఇలాంటి స్థితి ఏర్పడితే వారి మధ్య ఏర్పడిన ప్రేమ ఖచ్చితంగా జీవితాంతం ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి స్థితికి చేరుకోగల్గినపుడే ప్రేమ పరిపూర్ణత సాధిస్తుంది. అలాగే ఓ సంపూర్ణమైన జీవితానికి పునాదిగా మారుతుంది. అలాంటి ప్రేమ మాత్రమే సమాజంలోని వారికి ఆదర్శప్రాయమవుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

Show comments