Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొద్దు ప్రేమలు.. పిరికి ప్రేమలు... శృంగార ప్రేమలు

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
ప్రేమపై లోతుగా అధ్యయనం చేసిన ఓ కత్తిలాంటి మజ్నును అసలు ప్రేమలు ఎన్ని రకాలూ... ఎలా ఉంటాయ్ అని అడిగితే ఇలా చెప్పుకొచ్చాడండీ....

WD

ఇతనో మొద్దు ప్రేమికుడు

అల్లంత దూరాన ఏ చెట్టు చాటు నుంచో లేదంటే ఏ కాలేజీ గోడ ప్రక్క నుంచో ఒకరికొకరు చూసుకుని ఆనక అల్లంత దూరం నుంచే ప్రేమ చూపులు విసురుకుంటూ ప్రేమలోకంలో విహరించినవారు. వీరు తమ ప్రేమను పెద్దలకు తెలియజేసేందుకు జంకుతూ, ప్రేమ మైకం నుంచి బయటపడలేక అలా నలుగుతూ గడిపేసేవారు. అందుకు ఇటువంటి వారిని మొద్దు ప్రేమికులు అనేశారండీ ఇప్పటి నవీన ప్రేమికులు.

ఆ తర్వాత సినిమా ప్రేమలు, టూర్ ప్రేమలు. ఇవేంటీ అనుకుంటున్నారా... పైన చెప్పిట్లు కళ్లూ-కళ్లూ కలిసిన తర్వాతి స్టెప్పన్నమాట. అప్పటి ప్రేమికులు కళ్లూ- కళ్లూ కలుపుకుని తమ ప్రేమను పెద్దలకు చెప్పేందుకు జంకుతూ గడిపిస్తే... ఈ తరహా ప్రేమికులు ధైర్యంగా కాలేజీలకు ఎగ్గొట్టి సినిమాలు, షికార్లతో కాలం గడుపుతారు. పెద్దలకు తెలిసిందని తెలిస్తే గజగజ వణుకుతూ మరోసారి సదరు అబ్బాయి/అమ్మాయి వైపు కన్నెత్తి చూసేందుకైనా సాహసించరు. ఇటువంటి ప్రేమ జంటల వారి ప్రేమలను పిరికి ప్రేమలు అనేశారండీ.

ఇదో పిరికి ప్రేమ జం ట

WD

అప్పుడే అయిపోలేదు... తరువాయి పేజీలో ఇంకా చదవండి...


WD

శృంగార ప్రేమికులు వీరే....

ఇక నేటి ప్రేమ రెచ్చిపోతూ ఉంది. పబ్‌లలో-పార్టీలలో, సినిమా హాళ్లలో- క్లాసు రూముల్లో, ఆఫీసు కార్యాలయాల్లో- అవసరమైతే ఇంటి లోగిళ్లలో... ఇలా సాగిపోతోంది నేటి ప్రేమికుల రాజ్యం. అనుకుంటే వారికి అడ్డే లేదు. ఇది ప్రేమికుల నిజమైన రాజ్యం అని అంటున్నా... అది ప్రేమికులు శృంగార రాజ్యంగా పరిగణించబడుతోంది.

మొద్దు ప్రేమలు, పిరికి ప్రేమల వల్ల కుటుంబాలకు ఎటువంటి హాని జరిగిన చరిత్ర లేదు. అయితే చివరగా చెప్పిన శృంగార ప్రేమలు మాత్రం కొండొకచో ప్రేమికులతోపాటు కుటుంబాలను సైతం ధ్వంసం చేస్తున్నాయి. అయినా ఊరుకుంటారా... ఈ శృంగార ప్రేమికులు.. పెద్దలు వారించినా, బతిమాలి, భవిష్యత్తు చెప్పినా... నాదే రాజ్యం అంటూ చెట్టుపై పక్షి మాదిరి గూటిని విడిచి ఎగిరిపోతారు.

ఇలా చెప్పుకొచ్చిన అతను ముక్తాయింపుగా ఇది కూడా కొసరాడండోయ్....

శృంగార ప్రేమికులకు చేతిలో పచ్చనోటు బలం కూడా తోడవ్వడంతో పెరగన్నం మూటలాంటి పెద్దల మాటను గిరాటేసి ఎంచక్కా శృంగార ప్రేమ రైలును ఎక్కేస్తున్నారు. చివరి మజిలీ ఎక్కడికి చేరుతుందో... తమ కుటుంబ కట్టుబాట్లు ఏమవుతాయో అనే చింతన లేనేలేదు. జై ప్రేమ శృంగారం అంటూ దూకేస్తున్నారు. ఆనక మనం ఇటువంటి ప్రేమ జంటలకు సంబంధించిన వార్తలు మన చెవికి చేరుతుంటాయ్. చదువుతుంటాం. ఎంత చెప్పినా... ఈ పబ్... వగైరా... వగైరా ప్రేమలు ఆగుతాయంటారా...? మీరైనా చెప్పండి ప్లీజ్....... అంటున్నాడండీ. మరి మనం ఏమన్నా చెపుదామా... అయితే క్రింది బాక్సులో మీ అభిప్రాయాన్ని నింపేయండి మరి.

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments