Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం బడ్జెట్ 2013 14... ధరలు పెరిగేవి.. తగ్గేవి ఏంటి?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2013 (19:32 IST)
FILE
వార్షిక బడ్జెట్ 2013 14ను లోక్‌సభలో ఆర్థిక మంత్రి చిందబరం గురువారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ తర్వాత అంటే వచ్చే ఏప్రిల్ నెల నుంచి సెల్‌ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, సిగరెట్లు, విలాసవంతమైన కార్లు, బైక్‌ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. అదేసమయంలో తోలు వస్తువులు, పాదరక్షలు, రెడిమేడ్ దుస్తుల ధరలు, ఆభరణాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

మొబైల్ ఫోన్లు ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి భారీగా పెరగనున్నాయి. రూ.2000 వేలకు పైగా ధర కలిగిన మొబైల్ ఫోన్‌పై చిదంబరం ఏకంగా ఆరు శాతం పన్నును విధించారు. కొత్త మొబైల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ పన్నును కొనుగోలుదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదేసమయంలో మద్యంపై ఆయన ఎలాంటి సర్వీసు పన్నులు విధించక పోవడంతో మద్యంబాబులు ఊరట చెందారు.

ఆదాయ పన్ను పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు

ఆదాయపు పన్నుకు సంబంధించి గతంలో ఉన్న స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. వార్షిక ఆదాయం రూ.2.20 లక్షల లోపు ఉన్న వారు ఆదాయపు పన్నులోకి రారని తేల్చి చెప్పారు. రూ.2.20 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయం ఉన్నవారిపై 10 శాతం పన్ను యథాతథంగా ఉంటుందని పేర్కొన్నారు.

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారిపై 20 శాతం పన్ను, రూ.10 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను యథాతథంగా ఉంటుందన్నారు. అయితే, రూ.కోటి ఆదాయం ఉన్న వారిపై 30 శాతం పన్నుతో పాటు అదనంగా ఈ యేడాది నుంచి 10 శాతం సర్‌ఛార్జ్ వసూలు చేయనున్నట్లు చిదంబరం ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Show comments