Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్ 2013-14 నేడే : నాడు మొరార్జీ దేశాయ్.. నేడు చిదంబరం!

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2013 (10:40 IST)
FILE
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లోక్‌సభలో అత్యధిక సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఉన్నారు. మొరార్జీ దేశాయ్ 8 సార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను, రెండు సార్లు మధ్యంతర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. ఇపుడు చిదంబరం 8వ సారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా, 82వ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఆయన గురువారం 11 గంటలకు లోక్‌సకు సమర్పించనున్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖామంత్రులుగా 25 మంది విధులు నిర్వహించారు. వీరంతా కలిసి ఇప్పటి వరకు 81 వార్షిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టగా, ఇందులో 65 సాధారణ బడ్జెట్‌లు, 12 ఇంటీరియం బడ్జెట్‌లు, నాలుగు ప్రత్యేక బడ్జెట్‌లు ఉన్నాయి. వీటినే మినీ బడ్జెట్‌లుగా పిలుస్తారు.

మొత్తం 81 బడ్జెట్‌లలో మొరార్జీ దేశాయ్ ఇంటీరియం బడ్జెట్‌లతో కలుపుకుని మొత్తం 10 సార్లు బడ్జెట్‌ను సమర్పించగా, ఆ తర్వాత స్థానంలో చిందబరం ఉన్నారు. ఇప్పటి వరకు ఈయన ఏడు సార్లు సమర్పించగా, గురువారం తన ఎనిమిదో వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

Show comments