Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని కలుషితం చేస్తున్న సీరియల్స్ ఓ శాపంగా మారాయా!

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (17:03 IST)
o serial sean
మహిళలు ఇళ్ళలో పనులు చేసుకుని రిలీఫ్‌గా టీవీలో సీరియల్స్‌ చూసుకుంటూ వారికి వారు ఎంజాయ్‌మెంట్‌ పొందుతుంటారు. ఆ సీరియల్స్‌పై కూడా సినిమాల్లో సెటైర్లు వేస్తూ కొన్ని సన్నివేశాలు కూడా దర్శకులుచూపించారు. అయితే గతంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి వచ్చిన సీరియల్‌లో మూఢనమ్మకాలకు చాదస్తాలకు పరాకాష్టగా వున్న సందర్భాలున్నాయి. వాటివల్ల ప్రజలకు ఏమి చెబుతున్నారనేందుకు వారినుంచి చిత్రమైన సమాధానం కూడా వచ్చింది. పదిమందికి పనికల్పిస్తున్నాం అదే చాలు అంటూ నిర్వాహకులు సెలవిచ్చారు.
 
అయితే ఈమధ్య సీరియల్స్‌లో కంటెంట్‌ పెద్దగా లేకపోవడంతో ఒక్కో సీరియల్స్‌లో హావభావాలు లేని క్లోజ్ షార్ట్స్, మెడపై నుంచి కిందకి దిగడానికి 10 నిముషాలు ఇలా టైం సాగదీత సన్నివేశాలు ఎక్కువే. మహిళా పాత్రలే విలన్లుగా క్రియేట్‌ చేస్తున్నారు. అత్త, కోడలు, కూతురు, రెండో భార్య, మొదటి భార్య ఇలా ఆయా ఆపాత్రలతో విలనిజాన్ని సరికొత్తగా క్రియేట్‌ చేస్తున్నారు. దానివల్ల రాసే రచయితలకు, దర్శకులు, టీవీ ఛానల్స్‌కు రేటింగ్‌ వుంటుందేమోకానీ చూసే ప్రేక్షకులు నరకమే. ఆయా సీరియల్స్‌ చూసే వారికి గత్యంతరంలేక మరో ఛానల్‌ పెడితే అక్కడా ఇదే చాదస్తం కనబడేసరికి వేరే మార్గం లేక చూడాల్సివస్తుందని పలువురు మహిళలు సర్వే లో తెలిపారు. 
 
ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమయ్యే ఓ సీరియల్‌లో లక్షాదికారికి ఒక భార్యవుండగా మరో పెండ్లి చేసుకుంటాడు. మొదటి భార్య వారి కుటుంబాన్ని నాశనం చేయాలనీ ప్లాన్స్ వేసింది. అది తెలిసి ఫైనల్గా మొగుడు  ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు సంతకం కూడా పెడతాడు. కానీ ఆమె ఆ ఇల్లు వదిలి వెళ్ళదు. ఇంటిలోని మిగిలిన పాత్రలు కానీ అత్తగారుకానీ వెళ్ళమని అనరు. రెండో భార్యగా వచ్చిన ఆమెను కూడా మొదటి భార్య టార్చెర్‌ పెడుతుంటూ చోద్యంలా మిగిలిన పాత్రలు చూస్తూవుంటారు. ఆమెను కంట్రోల్‌ చేయలేరు. 
 
ఇక దానికంటే పరాకాష్ట ఏమిటంటే  పెద్ద కొడుకు భార్యకు ఇద్దరు పిల్లలు పుట్టారని తెలియగానే ఆసుపత్రికి వస్తాడు. కానీ పిల్లని చూడడు. అందరూ ఉండగెనే ప్రసవించిన భార్య ఆసుపత్రినుంచి ఇద్దరు పిల్లతో వెళ్ళిపోతుంది. ఒక ఆమె పురిటి నొప్పిల కష్టాలు, ఏడుస్తూ చెప్పే పేజీలపేజీల డైలాగ్‌లు వినలేక టీవీలు కట్టేసుకున్న సందర్భాలున్నాయి. ఇలాంటివాటికి ఎందుకు చూపిస్తారంటూ ఇటీవలే ఆ ఛానల్‌కు ఫోన్‌లు కూడా వెళ్ళాయి. కానీ వారినుంచి సరైన సమాధాన లేకుండా పోయింది. ఇక అక్కడ రచయితలను అడిగితే, ఛానల్‌ ప్రోత్సహంవల్ల మేం కథల్ని ఇష్టంవచ్చినట్లు మార్చాల్సివస్తుంది. అంటూ సమాధాన ఇచ్చారు. 
 
సీరియల్స్‌ వల్ల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు, బి. పి లు., షుగర్ లెవల్ పెరగడమే కానీ ఉపయోగం లేదు. బయట ఎలాగూ రాజకేయాలతో సమాజం చెడిపోయి ఉంది. ఇంటిలోనైనా ప్రశాంతంగా ఉందని వచ్చిన మగాళ్లకు సీరియల్స్ ఓ శాపంగా మారాయని పలువురు తెలియయజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments