Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నుంచి గోద్రెజ్ డ్రీమ్ హోం ఆడండి లైఫ్ మార్చుకోండి!!

Webdunia
WD
WD
ప్రముఖ గృహోపకరాణాల వస్తు ఉత్పత్తి సంస్థ గోద్రెజ్ కంపెనీ.. సన్ టీవీ నెట్‌వర్క్‌తో కలిసి ఒక వినూత్న రియాలిటీ షోను నిర్వహించనుంది. గోద్రెజ్ డ్రీమ్ హోం ఆడండి లైఫ్ మార్చుకోండి అనే పేరుతో ఈ షోను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనదలచిన వారు గోద్రెజ్ వస్తువులను కొనుగోలు చేసి తమ పేర్లను ఎస్ఎంఎస్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఈ వినియోగదారులు మాత్రమే ఎస్ఎంఎస్, ఐవీఆర్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. తమిళనాడుకు చెందిన కష్టమర్లు ఎస్ఎంఎస్‌ కాకుండా, గోద్రెజ్ మేక్స్ మై లైఫ్ బ్రైటర్ అనే నినాదంతో పది పదాలు రాసి నమోదు చేసుకోవచ్చు.

ఈ రియాలిటీ షోను కేవలం దక్షిణ భారత దేశంలోనే సన్ నెట్‌వర్క్ ద్వారా ప్రసారం చేయనున్నారు. తమిళంలో గోద్రెజ్ విళావై మాట్రలాం వాంగా అనే పేరుతో ప్రతి ఆదివారం ఉదయం 11-12 గంటల మధ్య సన్ టీవీలో ప్రసారం కానుంది. అలాగే, తెలుగులో గోద్రెజ్ డ్రీమ్ హోమ్, ఆడండి లైఫ్ మార్చుకోండి అనే పేరుతో ప్రతి ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్య జెమినీ టీవీలో ప్రసారం చేస్తారు. అలాగే కన్నడలో గోద్రెజ్ గేమ్ ఆడి.. లైఫ్ ఛేంజ్ మాడి అనే పేరుతో ప్రతి ఆదివారం ఉదయం 9-10 గంటల మధ్య ఉదయ టీవీలో ప్రసారం చేయనున్నారు.

గతంలో ఈ సంస్థ తొలి సెషన్‌లో దీన్ని హిందీలో ప్రసారం చేయగా బుల్లితెర వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో రెండో సెషన్‌ను సన్ టీవీ, బాంగ్‌ సినెర్జీతో కలిసి గోద్రెజ్ సంస్థ దక్షిణ భారతీయ భాషల్లో మాత్రమే టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై గోద్రెజ్ సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) అషుతోష్ తివారీ, బిగ్ సినెర్జీ డైరక్టర్ అనితా కౌల్ బసు, సన్ నెట్‌వర్క్ గ్రూప్ ప్రోగ్రామింగ్ హెడ్ రవినాథ్ మేనన్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments