Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయికిరణ్ శ్రీకృష్ణుడు - సన ద్రౌపది

Webdunia
WD
" తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి".. అంటారు. ఇదే బ్యానర్‌గా పెట్టి సీతారామయ్యగారి మనవరాలు, అన్నమయ్య, సింహాద్రి చిత్రాల నిర్మాత దొరస్వామిరాజు మహాభారతం అనే మెగా సీరియల్‌ను నిర్మిస్తున్నారు. సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నన్నయ, పోతన, తిరుపతి వేంకట కవుల పద్యాలు నేటికీ తెలుగు వాకిట వినిపిస్తూనే ఉంటాయి. చెల్లియో చెల్లకో అంటూ పాడకుండా ఉండేవారే ఉండరు. తెలుగుజాతి జీవితంలో మమేకమైన భారతాన్ని పిన్నలు, పెద్దలు, యువకులు చూసి ఆనందించేటట్లుగా వి.ఎం.సి సంస్థ నిర్మిస్తోంది. కృష్ణుడిగా సాయికిరణ్, ద్రౌపదిగా సన నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో స్టేజి నటులు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారు.

సీరియల్ దర్శకుడు ఉదయభాస్కర్ మాట్లాడుతూ... గతంలో హిందీలో వచ్చిన సీరియల్ కంటే మిన్నగా నిర్మించాలని ప్రయత్నిస్తున్నాం. ఘటోత్కచుని కుమారునికి భీముడు అన్ని విషయాలు చెప్పే సందర్భం నుంచి భారత కథ ప్రారంభమవుతుంది. దాదాపు 1000 ఎపిసోడ్లను ప్లాన్ చేస్తున్నాం. ప్రముఖ ఛానల్‌లో చూసి ప్రసారం చేస్తాం అన్నారు.

సాయికిరణ్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వంటి మహామహులు చేసిన పాత్రను తాను పోషించడం ఆనందంగా ఉందన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments