Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ నటి డింపుల్ కళ్లలో కారం: వర్మ ప్రేయసే కారణం..?

Webdunia
ఆట, తూర్పు పడమర సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి డింపుల్‌పై ఓ గుర్తు తెలియని యువతి మెరుపు దాడి చేసింది. కారులో వెళుతున్న డింపుల్‌తోపాటు ఆమె సహాయకుడి కళ్లలో కారం కొట్టి ఆపై ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. పదునైన ఇనుప రాడ్లతో డింపుల్ మెడపైనా నడుముకు పైభాగంపైన తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం.

దాడి నుంచి తేరుకునేలోపే ఆ ఆంగతుకురాలు అక్కడి నుంచి మెరుపు వేగంతో మాయమైంది. తీవ్రంగా గాయపడిన డింపుల్‌ను స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఈ దాడికి ముక్కోణపు ప్రేమే కారణమని అంటున్నారు. నటుడు, దర్శకుడైన శ్రీధర్ వర్మతో డింపుల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే అంతకుముందే శ్రీధర్ వర్మకు మరో గాళ్‌ఫ్రెండ్ ఉన్నదనీ చెపుతున్నారు.

వర్మ తనను వదిలించుకుని కొత్తగా డింపుల్ తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడాన్ని సహించలేని సదరు మాజీ ప్రేయసి డింపుల్‌పై దాడికి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ దాడిపై పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

Show comments